ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంటు అనుబంధ భవనంలో అధికారికి కరోనా.. రెండు అంతస్తులు మూసివేత..

ABN, First Publish Date - 2020-05-29T19:58:40+05:30

రాజ్యసభ సెక్రటేరియట్‌లోని ఓ అధికారికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో పార్లమెంటు సముదాయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజ్యసభ సెక్రటేరియట్‌లోని ఓ అధికారికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో పార్లమెంటు సముదాయంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య నాలుగుకు చేరినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నలుగురిలో ముగ్గురు సిబ్బందికి ఈ నెల 3న పార్లమెంటు కార్యకలాపాలు పునఃప్రారంభమైన తర్వాతే కరోనా సోకినట్టు తేలడం గమనార్హం. నిన్న విధులకు హాజరైన ఓ డైరెక్టర్ స్థాయి అధికారికి తన కుటుంబ సభ్యులతో సహా కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో పార్లమెంటు అనుబంధ భవనంలోని రెండు అంతస్తులను మూసివేసినట్టు అధికారులు వెల్లడించారు.


కాగా ప్రస్తుతం విధులకు హాజరయ్యే సిబ్బందికి ఒక్కొక్కరిగా స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే పార్లమెంటులోకి అనుమతిస్తున్నారు. వాహనాలను సైతం పూర్తిగా శానిటైజ్ చేసి కాంప్లెక్స్‌లోకి అనుమతిస్తున్నారు. కొవిడ్-19 కేసులు వెలుగుచూస్తున్న ప్రతిసారి.. ముందస్తు జాగ్రత్తగా పార్లమెంటు కాంప్లెక్స్‌లోని కృషి భవన్, శాస్త్రి భవన్, నీతి ఆయోగ్ సహా పలు మంత్రిత్వ శాఖలు, మంత్రులకు సంబంధించిన కార్యాలయాలను ఒకటి లేదా రెండు రోజులు మూసివేస్తున్నారు. 

Updated Date - 2020-05-29T19:58:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising