హాట్ టాపిక్‌గా 1962 నాటి ఘటన
ABN, First Publish Date - 2020-07-08T16:57:50+05:30
చైనా తన బలగాలను వెనక్కితీసుకోవడం సంచలనంగా మారింది.
చైనా తన బలగాలను వెనక్కితీసుకోవడం సంచలనంగా మారింది. కానీ డ్రాగన్ చర్యలను గుడ్డిగా నమ్మవచ్చా? చైనా మళ్లీ దొంగదెబ్బ తీస్తుందా? డ్రాగన్ వెనకడుగు వెనుక కుట్ర దాగుందా? 1962 నాటి ఘటన ఇప్పుడెందుకు హాట్ టాపిక్ అవుతోంది. 1962 జులై 15 నాడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఓ వార్త వచ్చింది. గాల్వన్ నుంచి చైనా బలగాలు వెనక్కి వెళ్లిపోయాయి. ఇది భారతీయ జవాన్ల విజయం. వారి పరాక్రమం గురించి ఆ పేజీలో రాశారు. అప్పుడూ ఇలాగే సరిహద్దు ఘర్షణలు ఉన్నాయి.
కానీ చైనా బలగాలు వెనక్కి వెళ్లిన మూడు నెలలకే రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. చైనా కుట్రలు, కుతంత్రాలకు ఇదో ఉదాహరణ. వెనక్కి వెళ్లినట్లు నమ్మించి.. దాడి చేయడం డ్రాగన్ నైజం. అయితే 1962లో భారత్‌కు కొత్తేమోకానీ.. ఇప్పుడు కాదు. అప్పుడు దెబ్బ తిన్నా.. 67లో ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో భారత్ తన సత్తా ఏంటో చూపించింది. కానీ మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి రావడంతో భారత్ డ్రాగన్‌ను గుడ్డిగా నమ్మడం లేదు.
Updated Date - 2020-07-08T16:57:50+05:30 IST