15 రాష్ట్రాల్లో కరోనా కేసులు.. ఒడిశాలో తొలి కేసు నమోదు
ABN, First Publish Date - 2020-03-17T01:33:52+05:30
భారత్‌లో కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లోని ప్రజలు మరింత భయాందోళనలకు లోనవుతున్నారు.
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లోని ప్రజలు మరింత భయాందోళనలకు లోనవుతున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదయింది. దీంతో ఇప్పటి వరకు దేశంలోని 15 రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదైనట్లయింది. ఈ నేపథ్యంలోనే కరోనా కేసుల్లో చికిత్స ఖర్చులను తమ ప్రభుత్వమే భరిస్తుందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు బిహార్‌లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. దేశంలో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, హరియాణా, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, జమ్మూకశ్మీర్, లడాఖ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్రలో మరో ఐదు కరోనా కేసులు నమోదవడంతో, ఈ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 38కి చేరింది. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్టం ఇదే. 22 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది.
Updated Date - 2020-03-17T01:33:52+05:30 IST