కేరళ వ్యాప్తంగా నేటి నుంచి 144 సెక్షన్ అమలు
ABN, First Publish Date - 2020-10-03T12:53:36+05:30
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కేరళ: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కచోట ఐదుగురు మించి గుమిగూడటాన్ని నిషేధిస్తూ సీఆర్‌పీసీ సెక్షన్ 144ను అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆంక్షలు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని సర్కార్ తెలిపింది. శనివారం ఉదయం 9 గంటల నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా మహమ్మారిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
Updated Date - 2020-10-03T12:53:36+05:30 IST