ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విరిగిపడిన కొండ చెరియలు.. మట్టిలో 12 పుర్రెలు, ఎముకలు!

ABN, First Publish Date - 2020-08-16T03:01:44+05:30

విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐజ్వాల్: విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో కొండచెరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ హాని జరగలేదు. కానీ కూలిన కొండ చెరియల మట్టిలో 12 పుర్రెలు, ఎముకలు, నగలు దొరికాయి. ఈ ఘటన మిజోరాంలోని మమిత్ జిల్లాలో సంభవించింది. శుక్రవారం విరిగిపడిన కొండ చెరియల ప్రాంతంలో 12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు, స్మోకింగ్ పైప్, కొన్ని పాత్రలు లభించాయి. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్‌రోజామా వెల్లడించారు. ‘ఈ పుర్రెలు తదితరాలు ఏకాలం నాటివో నేను చెప్పలేను. సరైన వివరణ లేకుండా వాటి కాలాన్ని అంచనా వేయడం తప్పు. అందుకే ఈ విషయంలో ఎటువంటి వ్యాఖ్యలు చేయను’ అని ఆయన చెప్పారు. అలాగే తమకు దొరికిన వస్తువులన్నింటినీ ఫోరెన్సిక్ విభాగానికి పంపుతున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-08-16T03:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising