ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగుల‌కు 11 మంది బ‌లి: రూ. 4 ల‌క్ష‌ల చొప్పున సీఎం న‌ష్ట‌ప‌రిహారం!

ABN, First Publish Date - 2020-07-01T12:55:09+05:30

ఒక‌వైపు కరోనా మ‌హ‌మ్మారితో త‌ల్ల‌డిల్లిపోతున్న‌ బీహార్‌లో త‌ర‌చూ పిడుగులు ప‌డుతూ, ప‌లువురిని బ‌లితీసుకుంటున్నాయి. తాజాగా మ‌రోమారు ప‌డిన పిడుగుల‌కు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్నా: ఒక‌వైపు కరోనా మ‌హ‌మ్మారితో త‌ల్ల‌డిల్లిపోతున్న‌ బీహార్‌లో త‌ర‌చూ పిడుగులు ప‌డుతూ, ప‌లువురిని బ‌లితీసుకుంటున్నాయి. తాజాగా మ‌రోమారు ప‌డిన పిడుగుల‌కు 11 మంది మృతిచెందారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో పిడుగులు పడి 11 మంది మృతి చెంద‌గా, చాప్రాలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల రూపాయల చొప్పున న‌ష్ట‌ప‌రిహారం మంజూరు చేస్తున్నట్లు సిఎం నితీష్ కుమార్ ప్రకటించారు. చప్రాలోని వివిధ ప్రాంతాల్లో పిడుగుల కారణంగా ఐదుగురు మరణించారు. అలాగే గార్ఖ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహమదా గ్రామంలో పిడుగుల‌ కారణంగా ముగ్గురు మృతిచెందారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి ఆరోగ్య శాఖ బృందం గ్రామానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఉన్న‌ట్టుండి కురిసిన భారీ వ‌ర్షం మ‌ధ్య‌లో పిడుగులు ప‌డ్డాయి. ఆరోగ్య‌శాఖ శిబిరానికి కొద్ది దూరంలోనే పిడుగులు ప‌డిన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ఒక్క‌సారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. 

Updated Date - 2020-07-01T12:55:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising