ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్తర్‌లో 11 మంది నక్సల్స్‌ లొంగుబాటు

ABN, First Publish Date - 2020-08-16T08:00:03+05:30

స్వాతంత్య్ర దినోత్సవం నాడు రెండు ప్రాంతాలలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయ్‌పూర్‌, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం నాడు రెండు ప్రాంతాలలో 11 మంది మావోయిస్టులు లొంగిపోయారు. చత్తీ్‌సగఢ్‌లోని బస్తర్‌ డివిజన్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ఒక మహిళ సహా ఐదుగురిపై రూ.16 లక్షల రివార్డు కూడా ఉంది. వీరంతా సుక్మా జిల్లాలోని సీనియర్‌ పోలీసు, సీఆర్‌పీఎఫ్‌ అధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఒకరు సుక్మా జిల్లాలోని ఎర్రబోర్‌ ప్రాంతానికి చెందిన బొడ్డు వెంకటేష్‌ అలియాస్‌ రాజీవ్‌ అని పోలీసులు తెలిపారు. రాజీవ్‌పై పలు కేసులున్నాయని 2010లో దంతేవాడలో జరిగిన భద్రతా బలగాలను పొట్టనబెట్టుకున్న ఘటనలో కూడా ఇతడు భాగస్వామి అని పేర్కొన్నారు. ఇతడి తలపై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉందని తెలిపారు. అలాగే, దంతేవాడలో మరో ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిని మహదేవ్‌ పోయం, సుఖ్‌రామ్‌, సుక్కి ఖోరామిగా పోలీసులు తెలిపారు. వీరి తలలపై లక్ష రూపాయల చొప్పున రివార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.


Updated Date - 2020-08-16T08:00:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising