ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్‌లో ‌11 గుర్రాలు మృతి... క్వారంటైన్‌లో మూడు... ఆందోళ‌న‌లో జ‌నం!

ABN, First Publish Date - 2020-05-30T11:23:41+05:30

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సమీపంలో గ‌ల‌ బెట్మాలో జంతువులలో వ్యాపించే వ్యాధి స్థానికుల‌ను కలవరపెడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఏకంగా 11 గుర్రాలు మృతి చెందాయి. మ‌రో మూడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్ సమీపంలో గ‌ల‌ బెట్మాలో జంతువులలో వ్యాపించే వ్యాధి స్థానికుల‌ను కలవరపెడుతోంది. లాక్‌డౌన్‌ సమయంలో ఏకంగా 11 గుర్రాలు మృతి చెందాయి. మ‌రో మూడు గుర్రాలను ఒక పొలంలో క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా క‌ల్లోలం మధ్య ఇలా గుర్రాలు మృత్యువాత ప‌డ‌టంతో స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, 11 గుర్రాలు చనిపోవడానికి న్యుమోనియా, గ్లైడర్ వంటి వ్యాధులే కారణమని ప‌శువైద్యులు చెబుతున్నారు. గుర్రాలు ఎలా చనిపోయాయో ఇప్ప‌టికీ తెలియ‌క‌పోవ‌డంతో స్థానికులు అనేక అపోహ‌ల‌కు లోన‌వుతున్నారు. గుర్రాల మృతి నేప‌ధ్యంలో డాక్టర్ స్వాతి కౌల్ మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన గుర్రాల న‌మూనాలను హిసార్‌లోని ప్రయోగశాలకు పరీక్ష కోసం పంపించామ‌ని, రిపోర్టుల కోసం ఎదురు చూస్తున్నామ‌ని తెలిపారు. మ‌రోవైపు గుర్రాల‌ను న‌ష్ట‌పోయిన బాధిత కుటుంబం  ప్రభుత్వం నుండి నష్టపరిహారం కోరుతోంది. గుర్రాల‌ యజమాని ఇర్ఫాన్ ఖాన్ మాట్లాడుతూ  పెళ్లిళ్ల సీజ‌న్ కోస‌మ‌ని, రుణం తీసుకొని గుర్రాలు కొనుగోలు చేశాం. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ ‌కార‌ణంగా  వివాహాలు ఆగిపోయి న‌ష్ట‌పోయాం. ఇప్పుడు గుర్రాల మృతితో రుణం ఎలా తీర్చాలో తెలియ‌డం లేద‌ని వాపోయారు. 

Updated Date - 2020-05-30T11:23:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising