ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళి ముందు ఘోర ప్రమాదం .. 10 మంది దుర్మరణం...

ABN, First Publish Date - 2020-11-14T04:16:18+05:30

40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శివపురి: దీపావళి ముందు మధ్య ప్రదేశ్‌లోని శివపురి జిల్లా పోహ్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందితో వెళ్తున్న ఓ వ్యాను తిరగబడడంతో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్ర గాయాలైనట్టు ఓ సీనియర పోలీస్ అధికారి వెల్లడించారు. దోడి గ్రామానికి చెందిన కొందరు షియోపూర్ జిల్లా ఉనావాద్‌లో జరిగిన ఓ మత కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం 7:15 సమయంలో... వేగంగా వెళ్తున్న వ్యాను ఓ ఇరుకైన రోడ్డులో ప్రవేశించగానే ఈ ప్రమాదం జరిగినట్టు శివపురి ఎస్పీ రాజేశ్ సింగ్ చాందేల్ వెల్లడించారు. ఆరుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందగా... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు ప్రాణాలు కోల్పోయినట్టు ఆయన తెలిపారు. క్షతగాత్రులను పోహ్రి, శివపురి జిల్లా ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-14T04:16:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising