ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెలిచే పార్టీతో... ట్రాఫిక్‌ పద్మవ్యూహం చిక్కు వీడేనా

ABN, First Publish Date - 2020-11-21T16:41:31+05:30

సికింద్రాబాద్‌ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్యగా మారింది. ఎన్నికల సమయంలో ట్రాఫిక్‌ సమస్య తీరుస్తామని ఓట్లు అభ్యర్థించే నాయకులు గెలిచిన తరువాత హామీలు మరిచిపోతున్నారు. తార్నాక-సికింద్రాబాద్‌-బేగంపేట్‌ మీదుగా అటు హైటెక్‌ సిటీ, ఇటు ఉప్పల్‌ వైపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : సికింద్రాబాద్‌ మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులకు ట్రాఫిక్‌ సమస్యగా మారింది. ఎన్నికల సమయంలో ట్రాఫిక్‌ సమస్య తీరుస్తామని ఓట్లు అభ్యర్థించే నాయకులు గెలిచిన తరువాత హామీలు మరిచిపోతున్నారు. తార్నాక-సికింద్రాబాద్‌-బేగంపేట్‌ మీదుగా అటు హైటెక్‌ సిటీ, ఇటు ఉప్పల్‌ వైపు రాకపోకలు సాగించే వాహనదారులు ట్రాఫిక్‌ చక్రబంధంలో ఇరుక్కుంటున్నారు. ఇక వర్షం పడితే వాహనదారులు గంటల కొద్దీ రోడ్డుపైనే నిరీక్షించడం జరుగుతుంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య జటిలమవుతుంది. ఇక అంతర్గత రోడ్లయిన స్టేషన్‌ రోడ్డు, మోండా మార్కెట్‌, బండిమ్మెట్‌, పాలికబజార్‌, ఆర్‌పిరోడ్డు ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్‌ స్తంభించిపోతుంది. గ్రేటర్‌లో అధికారంలోకి వచ్చే పార్టీ ఈ ట్రాఫిక్‌ సమస్య తీరుస్తఉందా? షరా మామూలేనా?; అనేది వేచి చూడాలి.


భవిష్యత్‌ కాదు.. వర్తమానం ఆలోచించాలి..: శ్రీనివాస్, సాఫ్ట్‌వేర్

భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకొని కోట్ల రూపాయలతో ప్లై ఓవర్లు, స్కై వేలు నిర్మిస్తున్నారు. ఇంకా కొన్నింటికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ట్రాఫిక్‌ సమస్య ఉన్న ప్రాంతాలపై చర్యలు తీసుకోవడంలేదు. దీంతో నగర వాసులకు ట్రాఫిక్‌ పద్మవ్యూహంలా మారింది. యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ, ప్లై ఓవర్‌లు, స్కైవేలు ట్రాఫిక్‌ ఉన్న ప్రాంతాలలో చేపట్టాలి. పాదచారుల కోసం పాదచారుల వంతెనలు, అండర్‌ పాసులు నిర్మించాలి.

Updated Date - 2020-11-21T16:41:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising