బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ బస్తీ నిద్ర
ABN, First Publish Date - 2020-11-26T18:28:24+05:30
ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకునేందుకు బోరబండ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ రోజుకొక కాలనీలో..
హైదరాబాద్: ప్రజల సమస్యలను దగ్గరుండి తెలుసుకునేందుకు బోరబండ బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ రోజుకొక కాలనీలో బస్తీ నిద్ర చేస్తున్నారు. బోరబండ డివిజన్‌లో సుదీర్ఘకాలంగా చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. తనను ఆశీర్వదించి గెలిపిస్తే సమస్యల పరిష్కారం చేసి చూపిస్తానని బస్తీ వాసులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్నానని, రోడ్లు, వీధి లైట్లు, నీళ్లు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయిబాబా నగర్‌కు అభివృద్ది నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ఇంతకుముందు బీజేపీ ఎంపీగా ఉన్న బండారు దత్తాత్రేయ ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాలు కట్టించారని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అంతకుమించి ఇక్కడ అభివృద్ధి పనులు జరగలేదని చెప్పారు.బోరబండ డివిజన్ ప్రజలు తనకు అవకాశం ఇస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
Updated Date - 2020-11-26T18:28:24+05:30 IST