ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది : స్మృతి ఇరానీ

ABN, First Publish Date - 2020-11-25T18:02:49+05:30

శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, రోహింగ్యాల విషయంలో టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శాంతిభద్రతల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని, రోహింగ్యాల విషయంలో టీఆర్‌ఎస్ సర్కార్ కేంద్రానికి ఫిర్యాదు చేస్తే.. రోహింగ్యాలపై చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. అక్రమ చొరబాటుదారులకు టీఆర్‌ఎస్, ఎంఐఎం మద్దతిస్తున్నాయని, అక్రమ చొరబాటుదారులు ఓటర్ లిస్టుల్లో కూడా ఉన్నారని ఆమె ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ...   రోహింగ్యాలను టీఆర్‌ఎస్, ఎంఐఎం కలిసి తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకుంటున్నాయని, 75 వేల రోహింగ్యాల కుటుంబాలు హైదరాబాద్‌లో నివసిస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్- ఎంఐఎంది అవినీతి కూటమి అని, రోహింగ్యాలను ఓటర్ లిస్టులో చేర్చమని ఎంఐఎం కేంద్రానికి లేఖ కూడా రాసిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఎందరో మంది అమరులయ్యారని, ఆ తెలంగాణలోనే ఇప్పుడు కుటుంబ పాలన సాగుతోందని ఇరానీ తీవ్రంగా మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తూనే ఉందని, అందుకే బీజేపీ కార్యకర్తలపై పోలీసులను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలపై అధికార టీఆర్‌ఎస్ అక్రమ కేసులు బనాయిస్తోందని, దుబ్బాకలో కూడా బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 75 వేల అక్రమ కట్టడాలు వెలిశాయని, అవన్నీ టీఆర్‌ఎస్, ఎంఐఎం భాగస్వామ్యంతోనే వెలిశాయని విమర్శించారు.


 సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్నదే తమ నినాదమని, ఆ నినాదంతోనే ముందుకెళ్తామని ఇరానీ స్పష్టం చేశారు. సిటీలో వరదల కారణంగా 80 మంది చనిపోయారని, వరద నష్టంపై ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం సమగ్ర నివేదికలనే కేంద్రానికి పంపలేదని ఆమె దుయ్యబట్టారు. కేంద్రం అమలు చేస్తోన్న అనేక పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేసి ఉంటే కరోనా సోకిన పేదలకు చాలా లాభం చేకూరి ఉండేదని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-11-25T18:02:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising