ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటేస్తేనే ప్రశ్నించే హక్కు: కోదండరాం

ABN, First Publish Date - 2020-12-01T16:35:58+05:30

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రొఫెసర్ కోదండరాం పిలుపు ఇచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు వేస్తేనే ప్రశ్నించే హక్కు ఉంటుందన్నారు. మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఓటు అని అన్నారు. మన హక్కులను సాధించుకోవడానికి తర తరాలుగా పోరాటాలు జరిగాయని, ఎంతోమంది ప్రాణాలు పోయాయన్నారు. 


భారత దేశంలో కూడా 1919 నుంచి ఓటు హక్కు కోరుతూ పోరాటాలు అనేకం జరిగాయని కోదండరాం అన్నారు. చివరికి భారత రాజ్యాంగం వచ్చిన తర్వాతనే సర్వజనీనమైన ఓటు హక్కు అందరికీ లభించిందన్నారు. ఆ ఓటు హక్కు వల్లనే దేశ స్వభావం మారిందన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలోనూ, విధానాలు ప్రభావితం చేయడంలోనూ ప్రతి మనిషికి సమానమైన విలువ దక్కిందన్నారు. అంత కీలక మార్పు తెచ్చిన ఓటును మనం వినియోగించుకోకపోతే మన అస్థిత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని కోదండరాం అన్నారు.

Updated Date - 2020-12-01T16:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising