బీజేపీకి మద్దతుగా రంగంలోకి కత్తి కార్తీక..
ABN, First Publish Date - 2020-11-24T17:05:18+05:30
బిగ్‌బాస్ ఫేమ్, కార్తీక గ్రూప్ చైర్మన్ కత్తి కార్తీక బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రధాన మంత్రి మోదీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలై తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నట్టు తెలిపారు. బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తుందని
హైదరాబాద్ : బిగ్‌బాస్ ఫేమ్, కార్తీక గ్రూప్ చైర్మన్ కత్తి కార్తీక బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ప్రధాన మంత్రి మోదీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితురాలై తాను త్వరలో బీజేపీలో చేరుతున్నట్టు చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొననున్నట్టు తెలిపారు. బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్‌ను ఆర్థ్ధిక మంత్రిగా చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో తాను బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆమె తెలిపారు.
Updated Date - 2020-11-24T17:05:18+05:30 IST