ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వరద సాయం’తో గులాబీ గాలం..!

ABN, First Publish Date - 2020-11-22T17:35:42+05:30

జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అందుబాటులో ఉన్న అన్ని ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని దక్కించుకునేందుకు గులాబీ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల ప్రజలకు అందించిన వరద సాయాన్ని కొందరు నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.  అందుబాటులో ఉన్న అన్ని ప్రణాళికలను అమలు చేసి విజయాన్ని దక్కించుకునేందుకు గులాబీ నేతలు వ్యూహరచనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇటీవల ప్రజలకు అందించిన వరద సాయాన్ని కొందరు నేతలు ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్నారు. తమ ప్రభుత్వం ప్రజల్ని ఆపత్కాలంలో ఆదుకుందని గుర్తుచేస్తూ, సాయం అందని వారికి ఎన్నికల తర్వాత అందేలా చేస్తామని హామీ ఇస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు.


సాయం పొందిన వారు ఓటేస్తారన్న ధీమా...

ఇప్పటి వరకూ సాయం పొందిన బాధితుల జాబితాను జీహెచ్‌ఎంసీ, రెవెన్యూశాఖ నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు సేకరించినట్లు సమాచారం. వారి ఆధార్‌ కార్డులు, ఇంటి నంబర్లను తెప్పించుకున్న నాయకులు.. తమకే ఓటు వేయాలని ఆ అభ్యర్థులను కోరుతున్నారని సమాచారం. తాము సాయం పొందలేదని అన్నవారికి ఆధారాలు చూపించి మరీ ఓటును అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఆ మేరకు స్పందిస్తారని పార్టీ నేతల్లో ధీమా కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే సాయం పొందినవారు, మున్ముందు పొందాల్సిన వారు కూడా తమకే ఓటు వేస్తారని వారు భావిస్తున్నారు. వరద సాయాన్నే ప్రచారంలో ప్రధానంశంగా ప్రస్తావించాలని అధిష్ఠానం నుంచి అభ్యర్థులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-11-22T17:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising