ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలోకి.. అంతలోనే షాక్ ఇచ్చిన బీజేపీ..!

ABN, First Publish Date - 2020-11-22T15:27:07+05:30

రాజేంద్రనగర్‌ (60) డివిజన్‌ నుంచి బీజేపీ ప్రకటించిన జాబితాలో శివరాంపల్లికి చెందిన పి.అర్చన పేరు రాగా, అదే పార్టీ నుంచి బీ-ఫారం మాత్రం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన బుద్వేల్‌కు చెందిన కోరని అనసూయకు వచ్చింది. దీంతో డివిజన్‌లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : రాజేంద్రనగర్‌ (60) డివిజన్‌ నుంచి బీజేపీ ప్రకటించిన జాబితాలో శివరాంపల్లికి చెందిన పి.అర్చన పేరు రాగా, అదే పార్టీ నుంచి బీ-ఫారం మాత్రం ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసిన బుద్వేల్‌కు చెందిన కోరని అనసూయకు వచ్చింది. దీంతో డివిజన్‌లో ఇది హాట్‌టాపిక్‌గా మారింది. వారం రోజుల క్రితం టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరిన అర్చనకు టికెట్‌ ఖాయమని అనుకున్నారు. జాబితాలో కూడా అర్చన పేరు వచ్చింది. నామినేషన్‌ వేసి బస్తీలలో ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. శనివారం కూడా ఎర్రబోడలో ప్రచారం చేశారు. ఈ సమయంలో పార్టీ బీ ఫారం మరొకరికి వచ్చిందని తెలిసి అవాక్కయ్యారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి రాకపోవడంతో బుద్వేల్‌కు చెందిన అనసూయ బీజేపీ టికెట్‌ కోసం పార్టీ నాయకులను కలిశారు. ఇద్దరి పై సర్వే నిర్వహించగా అనసూయ బీజేపీ అభ్యర్థి అయితే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని భావించి పార్టీ ఆమెకు శనివారం బీ-ఫారం అందజేసింది. డబ్బులకు ఆశపడి టికెట్‌ అనసూయకు ఇచ్చారని అర్చన మండిపడ్డారు. కాగా అనసూయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి బీ ఫారం అందజేసి అధికారికంగా బీజేపీ అభ్యర్థిగా జాబితాలో చేరారు.

Updated Date - 2020-11-22T15:27:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising