ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా భయం పోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండగలనా?

ABN, First Publish Date - 2020-02-07T18:20:32+05:30

నా వయసు 26 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నా వయసు 26 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. నాకు స్నేహితులు ఎక్కువే. వారిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారు. అలా అని నాకు ఎటువంటి ప్రేమవ్యవహారాలు లేవు. మా ఇంట్లోవాళ్లు పెళ్లి చేసుకోమని తొందర పడుతున్నారు. కానీ నాకు భయంగా ఉంది. వచ్చేవ్యక్తి నన్ను అర్థం చేసుకుంటాడో లేదో, గొడవలొస్తాయేమోనని. కానీ ఎన్నాళ్లు వద్దనగలను? నా భయం పోయి పెళ్లి చేసుకుని హాయిగా ఉండగలనా?

- సమత

బహుశా మీకు తెలిసినవాళ్లలో ఎవరైనా భార్యాభర్తలు గొడవలు పడటం చూసి ఉంటారు. అది మనసులో భయంగా ఉండిపోయి ఉంటుంది. అదికాక మీకంటూ వ్యక్తిత్వం, ఆర్థికస్వాతంత్య్రం ఉంది. పెళ్లి కారణంగా కొత్త సమస్యలొచ్చి ఈ సంతోషం దూరం అవుతుందని కూడా మీకు అనిపించొచ్చు. అయితే మీకున్న భయాలే అవతలివారికీ ఉంటాయి కదా! చదువు, ఉద్యోగం మరింత ఆత్మవిశ్వాసం పెంచాలేగానీ పిరికితనంతో, లేనిపోని భయాలతో భవిష్యత్తు పాడు చేయకూడదు.

 

మీకు వివాహం పట్ల వ్యతిరేకత లేదు కాబట్టి మీ పెద్దవాళ్లతో లేదా స్నేహితులతో చర్చించండి. అలాగే కాబోయే జీవిత భాగస్వామితోనూ మీ ఆలోచనలు పంచుకోండి. అన్నివిధాలా మీకు తగినవారని అనుకున్నాకే ముందుకెళ్లండి. అలాగని మరీ మొండిగానూ ఉండకూడదు. పెళ్లంటే కొన్ని సర్దుబాట్లు కూడా. అందుకు సిద్ధపడితే ఏ సమస్య అయినా సులభంగా తేలిపోతుంది.

 

- కె.శోభ

ఫ్యామిలీ కౌన్సెలర్‌, హార్ట్‌ టు హార్ట్‌

shobhas292@gmail.com

Updated Date - 2020-02-07T18:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising