ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదే పదే చేతులు కడిగినప్పుడు...

ABN, First Publish Date - 2020-05-12T14:39:19+05:30

కరోనా సోకకుండా చేతులను పదే పదే శుభ్రపరుచుకోవడం కోసం వాడే శానిటైజర్లు, సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారడం, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడం లాంటి సమస్యలు కొందరిలో కనిపిస్తూ ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(12-05-2020):

కరోనా సోకకుండా చేతులను పదే పదే శుభ్రపరుచుకోవడం కోసం వాడే శానిటైజర్లు, సబ్బుల్లో ఉండే రసాయనాల వల్ల చర్మం పొడిబారడం, ఇన్‌ఫెక్షన్‌ తలెత్తడం లాంటి సమస్యలు కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. 


ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

ఆల్కహాల్‌తో తయారయ్యే శానిటైజర్లలోని రసాయనాలు సున్నిత చర్మం కలిగిన వారిని దురద, మంటలతో ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అవే చేతులతో ముఖాన్ని తాకితే ముఖ చర్మం కూడా అవే ఇబ్బందులను ఎదుర్కొంటుంది. 


డెర్మటైటిస్‌, ఎగ్జిమా లాంటి చర్మ సమస్యలు పొడిచర్మం కలిగిన వారిలో సహజం. అలాగే లాక్‌డౌన్‌ మూలంగా విపరీతమైన ఒత్తిడికి లోనయ్యే తత్వం కలిగిన వారిలో కూడా చర్మ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి వారు శానిటైజర్లు, సబ్బులు పదే పదే వాడడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.


వైద్య వృత్తిలో ఉన్న వైద్యులు, నర్సులు ఎక్కువ సమయం పాటు చేతులకు గ్లౌజులు ధరించడం వల్ల కూడా డెర్మటైటిస్‌ వచ్చే వీలుంది. 


మాస్క్‌లు, గాగుల్స్‌ ధరించడం వల్ల దురద, మంట తలెత్తవచ్చు. తలకు ధరించే టోపీల వల్ల ఫాలిక్యులైటిస్‌, సెబరోయిక్‌ డెర్మటైటిస్‌ లాంటి సమస్యలూ తప్పవు. కాబట్టి పొడి చర్మం కలిగిన వారు చేతులు శుభ్రం చేసుకున్న ప్రతిసారీ మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. 


వైద్య వృత్తిలో ఉన్న వారు పి.పి.ఇ సూట్‌ ధరించే ముందు బారియర్‌ క్రీమ్స్‌, మాయిశ్చరైజర్లు వాడాలి. అలాగే చర్మ ఆరోగ్యాన్ని కాపాడే స్కిన్‌ ఫ్రెండ్లీ సబ్బులు, షాంపూలు ఎంచుకోవాలి.

Updated Date - 2020-05-12T14:39:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising