ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెట్లు ఎక్కుతోంటే కాళ్ల నొప్పి.. కారణమేంటి..?

ABN, First Publish Date - 2020-11-04T20:17:25+05:30

నాకు నలభై ఏళ్లు. మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు నొప్పిగా అనిపిస్తున్నాయి. ఉదయం ఉండే హుషారు సాయంత్రానికి ఉండడం లేదు. మెనోపాజ్‌ కి దగ్గరవుతున్నానా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-11-2020)

ప్రశ్న: నాకు నలభై ఏళ్లు. మెట్లు ఎక్కుతుంటే కాళ్ళు నొప్పిగా అనిపిస్తున్నాయి. ఉదయం ఉండే హుషారు సాయంత్రానికి ఉండడం లేదు. మెనోపాజ్‌ కి దగ్గరవుతున్నానా? 


- గీత, తిరుపతి


డాక్టర్ సమాధానం: సాధారణంగా మెనోపాజ్‌ మొదలయ్యే నాలుగైదు సంవత్సరాల ముందే ఆరోగ్యంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఉత్సాహం తగ్గడం, జుట్టు రాలడం, బరువు తేడా రావడం, చర్మం పొడిబారడం లాంటివి జరుగుతుంటాయి. మీ నీరసానికి కారణం ఏదైనా, కొన్ని రకాల చిట్కాలతో దాన్ని నివారించవచ్చు. విటమిన్‌- డి, బి- 12, ఐరన్‌ తక్కువైనా నీరసం వస్తుంది కాబట్టి ముందుగా వైద్యుల సహాయంతో మీ సమస్యను అధిగమించండి. రోజూ కనీసం ఐదారు బాదం గింజలు, రెండు ఆక్రోట్‌ గింజలు తినండి. కాల్షియం కోసం పాలు, పెరుగు, పనీర్‌ తీసుకోండి. వారానికి రెండు లేదా మూడుసార్లు ఆకుకూరలు తీసుకోవాలి. అన్నం తక్కువ మోతాదులో, కూర, పప్పు ఎక్కువగా తీసుకుంటే మంచిది. ప్రతి మూడు గంటలకు ఓసారి తక్కువ మోతాదులో ఆహారం తీసుకోండి. పండ్లు, సలాడ్లు, బఠాణీలు, సెనగలు, మరమరాలు లాంటివి మంచి స్నాక్స్‌ గా పనికొస్తాయి. రెండు లీటర్ల నీరు తాగండి. విటమిన్‌ - డి కోసం పావుగంట ఎండలో నడవండి. కేవలం కుటుంబ సభ్యులకే సమయం వెచ్చించడం కాకుండా మీ ఆనందం కోసం కూడా ఏవైనా ప్రవృత్తులు అలవర్చుకోండి. ఆరోగ్యానికి మంచిది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-11-04T20:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising