ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమతుల ఆహారం అంటే..

ABN, First Publish Date - 2020-09-16T19:36:09+05:30

సమతుల ఆహారం అంటే మన శరీరానికి అవసరమయ్యే పోషక పదార్ధాలను తగు పాళ్ళలో అందించే ఆహారం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-09-2020)

ప్రశ్న: సమతుల ఆహారం అంటే ఏమిటి? 


-వైష్ణవి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: సమతుల ఆహారం అంటే మన శరీరానికి అవసరమయ్యే పోషక పదార్ధాలను తగు పాళ్ళలో అందించే ఆహారం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు, నీరు మొదలైన పోషకాలను ఈ ఆహారం అందించాలి. సగటు వ్యక్తికి రోజూ సుమారు 2,000 క్యాలరీలు అవసరం, అయితే ఇది వయస్సు, లింగం, శారీరక శ్రమ స్థాయిని బట్టి మారుతుంది. మగవారికి ఆడవారి కంటే ఎక్కువ క్యాలరీలు అవసరం. వ్యాయామం చేసేవారికి ఎక్కువ క్యాలరీలు కావాలి. అలాగే గర్భిణులకు, బాలింతలకు కూడా. బాగా ఆటలాడే వారికి కార్బోహైడ్రేట్లు ఎక్కువగా అవసరం. అదే శారీరక శ్రమ తక్కువగా ఉండి, ఎక్కువ సేపు కూర్చుని పని చేసేవారికి క్యాలొరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువ కావాలి. ఎదిగే పిల్లలకు ప్రొటీన్లు, క్యాల్షియం ఇంకా పలు రకాల విటమిన్లు అత్యవసరం. టీనేజీ దాటిన ఆడపిల్లలకు ఐరన్‌ ఎక్కువ ఉండే ఆహారం అవసరం. ప్రత్యేకించి ఒక పోషకపదార్థం కోసం, అంటే కేవలం ప్రొటీన్ల కోసం షేక్స్‌, విటమిన్ల కోసం సప్లిమెంట్ల మీద ఆధారపడకూడదు. వీలున్నంత వరకు తీసుకునే ఆహారం ద్వారానే పొందాలి. దీనికి సమతుల్యమైన ఆహారం అవసరం. అందుకే వివిధ రకాల ధాన్యాలు, పప్పులు, గింజలు, కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలపదార్థాలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)



Updated Date - 2020-09-16T19:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising