ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పసుపును వంటల్లోగానీ, పాలల్లో గానీ వేసుకోవడం వల్ల..

ABN, First Publish Date - 2020-09-26T22:19:23+05:30

పసుపు, ఔషధ లక్షణాల గని. రంగు, రుచి కోసం పాకశాస్త్రంలో కూడా దీనికి విశిష్టత ఉంది. ఇది కర్కుమిన్‌ అనే పాలీఫెనాల్‌ ప్రధాన వనరు. శరీరానికి హానికలిగించే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(26-09-2020)

ప్రశ్న: పసుపు ఎందుకంత మంచిదో శాస్త్రీయంగా చెప్పండి.. 


- మంజు, కాకినాడ


డాక్టర్ సమాధానం: పసుపు, ఔషధ లక్షణాల గని. రంగు, రుచి కోసం పాకశాస్త్రంలో కూడా దీనికి విశిష్టత ఉంది. ఇది కర్కుమిన్‌ అనే పాలీఫెనాల్‌ ప్రధాన వనరు. శరీరానికి హానికలిగించే ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌, ఇన్‌ఫ్లమేషన్‌ తదితర జీవరసాయన క్రియల నుండి కర్కుమిన్‌ రక్షణనిస్తుంది. కర్కుమిన్‌ అధికంగా ఉండే పసుపు మెటబాలిక్‌ సిండ్రోమ్‌, ఊబకాయం, కీళ్లనొప్పులు, హైపర్‌ లిపిడిమియా లాంటి వ్యాధుల నుండి రక్షణనిస్తుంది. వ్యాయామం వల్ల వచ్చే కండరాల నొప్పులను తగ్గించడానికి కూడా కర్కుమిన్‌ సహాయపడుతుంది. అయితే పసుపులో ఉండే కర్కుమిన్‌ ను మన జీర్ణ వ్యవస్థ తేలికగా శోషించుకోలేదు. నల్ల మిరియాలతో లభించే పైపెరిన్‌ అనే పదార్థం పసుపులో కర్కుమిన్‌ జీవలభ్యతను దాదాపు రెండువేల శాతం ఇనుమడింప చేస్తుంది. కాబట్టి పసుపును వంటలలో వాడినా, పాలలో వేసి తీసుకున్నా దానితో చిటికెడు మిరియాల పొడి కూడా తీసుకుంటే పసుపు ప్రయోజనాలు పూర్తిగా అందుతాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2020-09-26T22:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising