ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్మా ఏ వయసువారు తినొచ్చు?

ABN, First Publish Date - 2020-11-25T18:43:30+05:30

వివిధ ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్న పప్పుదినుసులలో రాజ్మా ఒకటి. పోషకాహార భోజనంలో ఉండాల్సిన పదార్థాలలో ఇది ముఖ్యమైనది. శక్తినిచ్చే పిండిపదార్థాలు రాజ్మాలో అధికం. కండర నిర్మాణానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(25-11-2020)

ప్రశ్న: రాజ్మా పోషక విలువలేమిటి? అన్ని వయసులవారు తినొచ్చా? 


- నాగసుధ, కరీంనగర్‌


డాక్టర్ సమాధానం: వివిధ ప్రాంతాలలో ప్రాచుర్యంలో ఉన్న పప్పుదినుసులలో రాజ్మా ఒకటి. పోషకాహార భోజనంలో ఉండాల్సిన పదార్థాలలో ఇది ముఖ్యమైనది. శక్తినిచ్చే పిండిపదార్థాలు రాజ్మాలో అధికం. కండర నిర్మాణానికి, ముఖ్యంగా శాకాహారులకు అవసరమైన ప్రొటీన్లు వీటిల్లో సమృద్ధిగా ఉన్నాయి. ప్రొటీన్లు, పిండిపదార్థాలకు తోడు, పీచుపదార్థాలను కూడా కలిగి ఉండటం వల్ల రాజ్మా జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పీచుపదార్థాల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా అన్పించి తక్కువ ఆహారం తీసుకొనేలా చేస్తుంది. ఫెనోలిక్‌ యాసిడ్‌, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు లాంటి యాంటీ ఆక్సిడెంట్లు రాజ్మాలో ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బులు, పెద్దపేగు కాన్సర్లను నివారించేందుకు రాజ్మా దోహదం చేస్తుంది. రాజ్మా విడిగా కూర చేసుకొనేందుకే గాక, ఇతర కూరల్లో కలుపుకోవచ్చు. నిల్వ చేసేందుకు వీలుగా దొరుకుతుంది. ఏడాది పొడవునా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. కొన్ని రకాల కిడ్నీ సంబంధిత వ్యాధులున్న వ్యక్తులు తప్ప రాజ్మా అందరికీ అనువైన ఆహారమే. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-11-25T18:43:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising