ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్ల చుట్టూ వలయాలు పోవాలంటే?

ABN, First Publish Date - 2020-11-13T18:02:12+05:30

ఇంత చిన్న వయసులో వలయాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వంశపారంపర్య సమస్య కావచ్చు. రక్తహీనత వల్ల రావచ్చు. అధిక అలసట, అలర్జీల వల్లా కళ్ల చుట్టూ వలయాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(13-11-2020)

ప్రశ్న: నేను పదో తరగతి చదువుతున్నాను. నా కళ్ల చుట్టూ నల్లటి వలయాలున్నాయి. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల సమస్య మరింత ఎక్కువైంది. తరుణోపాయం ఏమిటి?


- అరుణ్‌ కుమార్‌, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: ఇంత చిన్న వయసులో వలయాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వంశపారంపర్య సమస్య కావచ్చు. రక్తహీనత వల్ల రావచ్చు. అధిక అలసట, అలర్జీల వల్లా కళ్ల చుట్టూ వలయాలు ఏర్పడతాయి. మీ విషయంలో కారణమేమిటో తెలుసుకోవాలి. ఒకవేళ రక్తహీనతే అయితే ఆహారంలో ఐరన్‌ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడండి. మీరు మాంసాహారులైతే వారానికి రెండు సార్లు నాన్‌వెజ్‌ తీసుకోండి. శాకాహారులైతే ఏదో ఓ రూపంలో ఆకుకూరలు తీసుకోవాలి. పాలు, పళ్లతో పాటు బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు తింటే అవసరమైన అన్ని పోషకాలూ అందుతాయి. సమయానికి భోజనం, నిద్ర ఉంటే అలసట వల్ల వచ్చే నల్ల వలయాలు తగ్గుతాయి. ఆన్‌లైన్‌ క్లాసులు అటెండ్‌ అవుతున్నా సరే మధ్య మధ్యలో పది నిమిషాలకోసారి కళ్లకు అరనిమిషం పాటు ఉపశమనం ఇవ్వడం మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - 2020-11-13T18:02:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising