ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షుగర్‌ ఉందా? అయితే...

ABN, First Publish Date - 2020-04-14T16:10:25+05:30

మధుమేహులకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కరోనా వైరస్‌ సోకకుండా చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, స్వల్ప వ్యాయామాలు కూడా చేయాలంటున్నారు వైద్యులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(14-04-2020)

మధుమేహులకు ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కరోనా వైరస్‌ సోకకుండా చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచుకోవాలి. పోషకాహారం తీసుకుంటూ, స్వల్ప వ్యాయామాలు కూడా చేయాలంటున్నారు వైద్యులు.


ఆహార నియమాలు!

వ్యాధినిరోధకశక్తి మెరుగ్గా ఉంచుకోవాలంటే మితాహారం పనికిరాదు. అలాగని మధుమేహులు అపరిమిత ఆహారం తీసుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఈ కోవకు చెందిన వారు తక్కువ పరిమాణంలోనే అన్ని పోషకాలు అందే సంపూర్ణ, సమతులాహారం తీసుకోవాలి. ఇందుకోసం...


రోజుకు మూడు పూటలూ,  మూడు భారీ భోజనాలకు బదులుగా తక్కువ పరిమాణాల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవాలి.

తాజా పళ్లు, కూరగాయలు తీసుకోవాలి.

తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ కలిగి ఉండే పదార్థాలు 

(కూరగాయలు, గోధుమలు, చిరుధాన్యాలు) తీసుకోవాలి. 

వేపుళ్లు వీలైనంత తగ్గించాలి.

చక్కెర, శీతలపానీయాలు, తేనె, బెల్లం తీసుకోవడం తగ్గించాలి.

ఆహారంలో మాంసకృత్తుల పరిమాణం పెంచాలి. పాలు, గుడ్లు, చేపలు, చికెన్‌ వాడకం పెంచాలి. మాంసాహారం పూర్తిగా ఉడకనివ్వాలి.


వ్యాయామం అవసరం!

లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కువ కాలం పాటు శరీర కదలికలు నియంత్రించడం మూలంగా రక్తంలో చక్కెర స్థాయులు, శరీర బరువు పెరిగే వీలు ఉంటుంది. కాబట్టి వీలున్నంతలో తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం....


ఇంట్లోనే అరగంట తగ్గకుండా, ఆపకుండా నడవాలి.

యోగా, ఏరోబిక్స్‌, స్కిప్పింగ్‌, స్ట్రెచెస్‌, యాబ్స్‌, పుషప్స్‌, క్రంచెస్‌, లైట్‌ వెయిట్స్‌ మొదలైన వ్యాయామాలు చేయాలి.

గదులు శుభ్రం చేయడం, తోట పని, పుస్తకాల అల్మారా సర్దడం లాంటి ఇంటిని శుభ్రపరిచే పనులు కూడా వ్యాయామ ఫలాన్నే అందిస్తాయి. 

శరీర బరువు అదుపులో ఉంచుకోవడం కోసం తాజా పళ్లు, కూరగాయలలతో పక్కా ఆహార ప్రణాళిక తయారుచేసుకుని, అనుసరించాలి.

గ్లైసెమిక్‌ ఇండెక్స్‌, క్యాలరీలు, పిండిపదార్థాలు, ఆహార పరిమాణాలు సరిచూసుకుంటూ పోషకాల లోపం ఏర్పడకుండా చూసుకోవాలి. 

ఇంట్లో ఎదురయ్యే బోర్‌డమ్‌, ఒత్తిడి, ఆందోళన ఫలితంగా పరిమితికి మించి ఆహారానికి ఆకర్షితులయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి చిరుతిళ్ల జోలికి వెళ్లకుండా మనసును నియంత్రించుకోవాలి.


డాక్టర్‌ వి. శ్రీ నగేష్‌,

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అండ్‌ డయబెటాలజిస్ట్‌

Updated Date - 2020-04-14T16:10:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising