ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిద్రలో మాట్లాడుతున్నారా? ఎందుకలా అంటే..

ABN, First Publish Date - 2020-03-10T20:05:44+05:30

కొందరికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. ఈ తత్వానికి ‘సామ్నిలోఖి’ అని పేరు. అయితే, నిద్రలో మాట్లాడే వారి మాటలు చాలా వరకు నిజజీవితంతో సంబంధమే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(10-03-2020)

కొందరికి నిద్రలో మాట్లాడే అలవాటు ఉంటుంది. ఈ తత్వానికి ‘సామ్నిలోఖి’ అని పేరు. అయితే, నిద్రలో మాట్లాడే వారి మాటలు చాలా వరకు నిజజీవితంతో సంబంధమే లేనట్లు అనిపిస్తాయి. అలా అనిపించడానికి అంతకుముందెప్పుడూ ఎవరితోనూ అలా మాట్లాడి ఉండకపోవడమే కారణం కావచ్చు. కొన్నిసార్లు ఆ మాటల్లో జీవితంలోని కఠోర సత్యాలు బయటపడిపోతుంటాయి. తమాషా ఏమిటంటే, నిద్రలో మాటలను వారు మేలుకున్న తర్వాత ప్రస్తావిస్తే,  నేనలా మాట్లాడనేలేదంటూ కొట్టి పారేస్తారు. నిజానికి ఇది ఒక రకం పారసామ్నియా.


నిద్రలోని వివిధ దశల్లో తలెత్తే ఒక రకమైన రుగ్మత. ఇది కొందరిలో వారసత్వంగా సంక్రమించవచ్చు. లేదంటే ఏదైనా మానసిక రుగ్మతకు సంబంధించిన సమస్య కావచ్చు. మామూలుగా అయితే ఇది మానసిక ఒత్తిళ్ల ఫలితంగా వస్తుంది. అనవసరమైన మందుల్ని అదేపనిగా వాడిన ఫలితమూ కావచ్చు. మద్యం, మాదక ద్రవ్యాల పరిణామం కావచ్చు. కొందరిలో దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య వల్ల కూడా ఈ సమస్య మొదలవుతుంది. నిద్రలో మాట్లాడేందుకు కారణంగా మనలో కనిపిస్తున్న లక్షణాలేమిటో ముందు పసికట్టాలి. ఆ తర్వాత అందుకు అవసరమైన వైద్య చికిత్సలు కూడా తీసుకోవాలి.

Updated Date - 2020-03-10T20:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising