ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాఖాహారులకు ప్రొటీన్ కొరత రాకుండా ఉండాలంటే..

ABN, First Publish Date - 2020-09-16T19:49:04+05:30

వీగన్‌ అంటే పూర్తి శాకాహారం. జంతువుల నుండి లభించే ఆహారానికి ఈ విధానంలో చోటు లేదు. అందువల్లే పాలు, పెరుగు, పాల పదార్థాలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-09-2020)

ప్రశ్న: వీగన్‌ ఫుడ్‌ తినేవారికి ప్రొటీన్‌ కొరత రాకుండా ఎలా చూసుకోవాలి?


- వెంకటేశ్వర్వర్లు, విజయవాడ


డాక్టర్ సమాధానం: వీగన్‌ అంటే పూర్తి శాకాహారం. జంతువుల నుండి లభించే ఆహారానికి ఈ విధానంలో చోటు లేదు. అందువల్లే పాలు, పెరుగు, పాల పదార్థాలు, తేనె, గుడ్లు, మాంసాహారం ఉండవు. ఆవు పాలు, గేదె పాలు, ఆ పాల నుండి తయారయ్యే పన్నీర్‌, పెరుగు, చీజ్‌ మొదలైన వాటిని పూర్తిగా మానెయ్యడం వల్ల ప్రొటీన్లు, కొన్ని రకాల ఆవశ్యక అమైనో యాసిడ్లు, కాల్షియం, కొన్ని రకాల విటమిన్లు తగిన మోతాదుల్లో పొందలేకపోవచ్చు. అయినా, వీగన్‌ ఆహార నియమాలు పాటించే వారు పాలు, పాల పదార్ధాల నుండి వచ్చే పోషకాలను వేరే శాకాహారం నుండి పొందవచ్చు. ప్రొటీన్ల కోసం అన్ని రకాల పప్పు ధాన్యాలు, సెనగలు, అలసందలు, సొయా బీన్స్‌, కిడ్నీబీన్స్‌, ఉలవలు మొదలైనవి తీసుకోవచ్చు. సొయా పాలతో చేసిన పన్నీర్‌ (టోఫు) ద్వారా చక్కని ప్రొటీన్‌ లభిస్తుంది. సొయా పాలు, బాదం పాలు తీసుకోవచ్చు. కూరగాయల్లో, ముఖ్యంగా బ్రోకలి, పాలకూరల్లో; బాదం, పిస్తా, వేరుశెనగ లాంటి గింజల్లో కూడా ప్రొటీన్‌ ఉంటుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)



Updated Date - 2020-09-16T19:49:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising