ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాంసాహారం ముట్టడు... ఏం చేయాలి?

ABN, First Publish Date - 2020-12-25T20:38:08+05:30

ప్రతిపూటా బాబు తీసుకునే ఆహారం సమతుల్యమైనదైతే శాకాహారమైనా, మాంసాహారమైనా తగిన పోషకాలు సమృద్ధిగానే లభిస్తాయి. కాబట్టి అంతగా విచారించాల్సిన అవసరంలేదు. మాంసాహారం ద్వారా మనకు ముఖ్యంగా లభించే పోషకాలు- ప్రొటీన్లు, ఐరన్‌, కాల్షియం,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(25-12-2020)

ప్రశ్న: మా బాబుకు ఏడేళ్లు. మాంసాహారం ముట్టడు. ప్రత్యామ్నాయంగా శాకాహారంలో ఎలాంటి ఆహారపదార్థాలు తినిపించాలో చెబుతారా?


- లక్ష్మీకాంత్‌, కర్నూలు


డాక్టర్ సమాధానం: ప్రతిపూటా బాబు తీసుకునే ఆహారం సమతుల్యమైనదైతే శాకాహారమైనా, మాంసాహారమైనా తగిన పోషకాలు సమృద్ధిగానే లభిస్తాయి. కాబట్టి అంతగా విచారించాల్సిన అవసరంలేదు. మాంసాహారం ద్వారా మనకు ముఖ్యంగా లభించే పోషకాలు- ప్రొటీన్లు, ఐరన్‌, కాల్షియం, కొన్ని రకాల విటమిన్లు. ఈ పోషకాల్లో చాలా వాటిని శాకాహారం నుండి కూడా పొందేలా చేయవచ్చు. ప్రొటీన్ల కోసం కంది, పెసర లాంటి పప్పులు; సెనగలు, అలసందలు, రాజ్మా, సోయా చిక్కుడు లాంటి గింజలు; పాలు, సోయా పాలు, పన్నీర్‌, పెరుగు, సోయా పన్నీర్‌ లాంటివి తీసుకుంటే సరిపోతుంది. రోజూ తప్పనిసరిగా ఆకుకూరలు తీసుకోవడం వల్ల కొంత వరకు ఐరన్‌, కాల్షియం లభిస్తుంది. శాకాహారంలో ముఖ్యంగా బి-12 విటమిన్‌ తక్కువగా ఉండే అవకాశం ఉంది. బి -12 కోసం పాలు, పెరుగుల పై ఆధారపడవచ్చు. వయసుకు తగ్గ ఎత్తు, బరువు పెరుగుతూ ఆరోగ్య సమస్యలేమీ లేనట్టయితే మీ బాబుకు పోషకాలు సరిగా అందుతున్నట్టే.  


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)


Updated Date - 2020-12-25T20:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising