ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌ గృహాల్లో ఇవి తప్పక పాటించాలి..

ABN, First Publish Date - 2020-04-11T17:18:20+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను పరిశీలించేందుకు 12 మంది సభ్యులతో ఏర్పాటైన సమన్వయ కమిటీతో ముఖ్యమంత్రి ఎడప్పాడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి వివిధ శాఖలు చేపడుతున్న చర్యలను పరిశీలించేందుకు 12 మంది సభ్యులతో ఏర్పాటైన సమన్వయ కమిటీతో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి సమీక్ష జరిపారు. సమావేశానంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రమంతటా కరోనా వైరస్‌ నిరోధక చర్యలు సక్రమంగానే అమలవుతున్నాయని చెప్పారు.


వైరస్‌ వ్యాప్తిని పరిశీలించినమీదటే లాక్‌డౌన్‌ కొనసాగించే విషయమై ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు. కరోనా వైరస్‌ అంటు వ్యాధని, వేగంగా అందరికీ వ్యాపించే ప్రమాదం ఉందన్నారు. ఆ వైరస్‌ వ్యాప్తిని రెండో దశలోనే కట్టడి చేయాల్సి ఉందని, మూడో దశలోకి ప్రవేశించకుండా ప్రజలు గృహనిర్బంధాన్ని కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక కరోనా వైరస్‌ తాకిడి గురై క్వారంటైన్‌లో ఉన్నవారు పాటించాల్సిన నియమాలను కూడా ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఆ ప్రకటనలో పేర్కొన్న నియమాలు ఇలా ఉన్నాయి


నియమాలు ఇవే..

క్వారంటైన్‌లో ఉన్నవారికి ప్రత్యేకమైన గది, టాయ్‌లెట్‌ సదుపాయం ఉండాలి.

ఆ వ్యక్తి నివసించే ఇంటిలో ఉన్నవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.

క్వారంటైన్‌లో ఉన్నవారు ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త వహించాలి.

క్వారంటైన్‌ ఇంటిలో పారిశుధ్య పనులు చేసేవారుకూడా తప్పకుండా మాస్కులు ధరించాలి.

క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తి ఉపయోగించిన వస్తువులను 

ఇతరుల తాకకూడదు, ఉపయోగించకూడదు.

క్వారంటైన్‌లో ఉన్నవారు ఉపయోగించిన దుస్తులు, దుప్పట్లు వేరుగా ఉంచాలి. 

వీలైతే ఉతికి ఎండలో ఆరబెట్టాలి.

మాస్కులు, గ్లౌసులు తీసిన తర్వాత చేతులను శుభ్రంగా కడగాలి.

గర్బిణులు, వృద్ధులు, చిన్న పిల్లలు కరోనా లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉండాలి.

క్వారంటైన్‌లో ఉన్నవారితోపాటు కుటుంబీకులు కూడా 

28 రోజులుపాటు గృహనిర్బంధంలో ఉండాలి.

క్వారంటైన్‌ ఇంటిలో రోజుకు మూడు సార్లు క్రిమినాశక మందులు చల్లాలి.

క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తికి జలుబు, దగ్గు అధికమైతే 

వెంటనే 104 లేదా 1800120555550 నెంబర్లకు ఫోన్‌ చేయాలి. 

Updated Date - 2020-04-11T17:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising