ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాక్స్ బ్రీతింగ్‌తో ఒత్తిడి మాయం!

ABN, First Publish Date - 2020-02-25T17:29:15+05:30

కొందరు తొందరగా ఒత్తిడికి లోనవుతారు. అలాంటివారు ‘బాక్స్‌ బ్రీతింగ్‌’ వ్యాయామంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శ్వాసను కొద్దిసేపు నిలిపి ఉంచే ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొందరు తొందరగా ఒత్తిడికి లోనవుతారు. అలాంటివారు ‘బాక్స్‌ బ్రీతింగ్‌’ వ్యాయామంతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. శ్వాసను కొద్దిసేపు నిలిపి ఉంచే ఈ సులుపైన ఎక్సర్‌సైజ్‌తో నాడీవ్యవస్థ మెరుగ్గా పనిచేసి క్షణాల్లో మనసు తేలికయి ఒత్తిడి మాయం అవుతుంది. అదెలాగో చూద్దాం. 


కేఫ్‌, ఆఫీసులో కూర్చున్న చోటే బాక్స్‌ బ్రీతింగ్‌ వ్యాయాయం చేయొచ్చు. వెన్నెముక నిటారుగా ఉండేలా సౌకర్యంగా ఉన్న కుర్చీలో కూర్చోవాలి. పాదాలు నేలకు ఆనించాలి. 


తరువాత కళ్లు మూసుకోవాలి. ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి. ఊపిరితిత్తులలోకి గాలి వెళుతున్నప్పుడు నెమ్మదిగా ఒకటి నుంచి నాలుగు అంకెలు లెక్కపెట్టాలి. గాలి పీల్చుకోవడం అయ్యాక శ్వాసను అలానే నిలిపి మళ్లీ ఒకటి నుంచి నాలుగు లెక్కపెట్టాలి. 


నోరు తెరవకూడదు. మరికొద్ది సమయం శ్వాసను బయటకు వదలకుండా నాలుగైదు సెకన్లు ఉండాలి.


ఆ తరవాత నెమ్మదిగా శ్వాస బయటకు వదలాలి. ఇలా రోజుకు రెండు నుంచి నాలుగు సార్లు చేస్తే ఒత్తిడి తగ్గిపోతుంది. 


బాక్స్‌ బ్రీతింగ్‌ చేయడం వల్ల మనసులోని సందిగ్దం తొలగిపోతుంది. ఏదైనా విషయం మీద మనసు లగ్నం చేయడం తేలికవుతుంది. వెన్నెముక, భుజాల మీద ఒత్తిడి తగ్గుతుంది.

Updated Date - 2020-02-25T17:29:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising