ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెపటైటిస్‌ సీ ఔషధాలతో కరోనాకు చెక్‌?

ABN, First Publish Date - 2020-05-06T16:20:20+05:30

కరోనా కట్టడికి మలేరియా, టీబీ, కుష్టు, కేన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధుల మందులు పనికొస్తాయా? అనే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జర్మనీ సూపర్‌ కంప్యూటర్‌ విశ్లేషణ

కరోనా కట్టడికి మలేరియా, టీబీ, కుష్టు, కేన్సర్‌, ఊపిరితిత్తుల వ్యాధుల మందులు పనికొస్తాయా? అనే దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే జర్మనీకి చెందిన జొహెన్స్‌ గుటెన్‌బర్గ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ‘మోగాన్‌ 2’ అనే సూపర్‌ కంప్యూటర్‌తో జరిపిన ఔషధ విశ్లేషణలో హెపటైటిస్‌ సీ మందులతో కరోనాను అడ్డుకోవచ్చని వెల్లడైంది. హెపటైటిస్‌ సీ నియంత్రణకు వాడే సిమిప్రివిర్‌, పారిటాప్రివిర్‌, గ్రేజోప్రివిర్‌, వెల్‌పాటాప్రివిర్‌ మందులను కరోనాకూ వాడొచ్చని గుర్తించారు. అధ్యయనంలో భాగంగా కరోనా వైర్‌సలో ఉండే కొన్ని ప్రొటీన్లను అడ్డుకోగలిగే దాదాపు 42 వేల పదార్థాల వివరాలను ఈ కంప్యూటర్‌కు అందించారు. ఈ కంప్యూటర్‌ తనకు ఉన్న భారీ కంప్యూటింగ్‌ శక్తితో రెండు నెలల్లో దాదాపు 3000 కోట్ల కాలిక్యులేషన్స్‌ చేసింది. కొవిడ్‌-19, హెపటైటిస్‌ సీ వ్యాధులను కలుగజేసే వైర్‌సలలో కొంత సారూప్యత ఉంటుంది. ఈ రెండింటిలోను ఒకే రకమైన ఆర్‌ఎన్‌ఏ క్రమం ఉంటుంది. గతంలో సార్స్‌ వ్యాధికి మందు కనిపెట్టే సమయంలోనూ ఈ పద్ధతిని అనుసరించారని శాస్త్రవేత్తలు గుర్తుచేశారు. 


- స్పెషల్‌ డెస్క్

Updated Date - 2020-05-06T16:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising