ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భయం వద్దు.. ఆ ఆహారాన్ని తినొచ్చు: ఎఫ్ఎస్ఎస్ఏఐ

ABN, First Publish Date - 2020-03-06T03:14:14+05:30

కరోనా వైరస్ బాధిత దేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఆహారం పూర్తిగా సురక్షితమని భారత ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ బాధిత దేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న ఆహారం పూర్తిగా సురక్షితమని భారత ఆహార నియంత్రణ సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. దీనిని ఎటువంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చని పేర్కొంది. దిగుమతి అవుతున్న ఆహారంలో కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు నిపుణులతో కూడిన కమిటీని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు చేసింది.


ఈ  ఆహారాన్ని పరీక్షించిన నిపుణుల బృందం అందులో కరోనా వైరస్‌కు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు కనబడలేదని పేర్కొంది. ఇప్పటి వరకు అయితే ఆహారం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలేమీ లేవని స్పష్టం చేసింది. కాబట్టి దిగుమతి అవుతున్న ఆహారాన్ని నిరభ్యంతరంగా వినియోగించవచ్చని పేర్కొంది. కరోనా వైరస్ ప్రధానంగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని.. తుమ్ము, దగ్గు, చేతులు కలపడం ద్వారా మనిషి నుంచి మనిషికి సోకుతుందని ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరించింది.

Updated Date - 2020-03-06T03:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising