శానిటైజర్ ఇలా వాడాలి!
ABN, First Publish Date - 2020-06-23T16:31:01+05:30
కరోనా కట్టడికి శానిటైజర్ల వాడకానికి అలవాటుపడ్డాం! అయితే ఎలాంటి శానిటైజర్‌ను ఎంచుకోవాలి? ఎలా వాడాలి? అనే విషయాల మీద కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి.
ఆంధ్రజ్యోతి(23-06-2020)
కరోనా కట్టడికి శానిటైజర్ల వాడకానికి అలవాటుపడ్డాం! అయితే ఎలాంటి శానిటైజర్‌ను ఎంచుకోవాలి? ఎలా వాడాలి? అనే విషయాల మీద కూడా అవగాహన ఏర్పరుచుకోవాలి.
సమర్థమైన శానిటైజర్: 60% నుంచి 95% ఆల్కహాల్ కలిసి ఉన్న శానిటైజర్లే సూక్ష్మక్రిములను సమర్థంగా చంపగలవు. ఈ మాత్రం ఆల్కహాల్ లేని శానిటైజర్లు అన్ని రకాల సూక్ష్మక్రిములనూ చంపలేవు. అలాగే ఆల్కహాల్ శాతం సరిపడా లేని శానిటైజర్లు కొన్ని సూక్ష్మక్రిముల పెరుగుదలను అడ్డుకోగలవు తప్ప, వాటిని వెంటనే చంపలేవు.
శానిటైజర్ వాడకం: శానిటైజర్లు సూక్ష్మక్రిములను చంపడానికి 30 సెకండ్ల సమయం పడుతుంది. కాబట్టి శానిటైజర్‌ను చేతుల్లో వేసుకుని, రుద్దుకున్న వెంటనే, తడిగా ఉన్నప్పుడే తుడిచేసుకోకూడదు. శానిటైజర్ చేతుల్లోనే పూర్తిగా ఆరనివ్వాలి.
సబ్బునీళ్లు: మట్టి, జిడ్డు, రసాయనాలు అంటుకున్నప్పుడు శానిటైజర్ వాడి చేతులను శుభ్రపరుచుకోవడం సరి కాదు. ఇలాంటప్పుడు సబ్బునీళ్లతో చేతులను కడిగి, ఆ తర్వాత శానిటైజర్ ఉపయోగించడం మేలు.
Updated Date - 2020-06-23T16:31:01+05:30 IST