ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కులను వాడుతున్నారా..?

ABN, First Publish Date - 2020-04-16T17:56:10+05:30

కరోనా బారిన పడకుండా ఉండేందుకుగాను మాస్కులు తప్పనిసరి కావడంతో చాలా మంది సర్జికల్‌ మాస్కులను వాడుతుండగా.. కొందరు ఇంట్లోనే వాటిని తయారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తయారు చేసుకుని వాడే మాస్కులను సబ్బు, వేడినీళ్లలో ఉతకాలి

ఎండలో 5 గంటలు ఆరబెట్టాలి

లేదంటే కుక్కర్‌లో ఉడికించాలి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15: కరోనా బారిన పడకుండా ఉండేందుకుగాను మాస్కులు తప్పనిసరి కావడంతో చాలా మంది సర్జికల్‌ మాస్కులను వాడుతుండగా.. కొందరు ఇంట్లోనే వాటిని తయారు చేసుకుంటున్నారు. మరికొందరు హ్యాండ్‌ కర్చీ్‌ఫలను వాడుతున్నారు. అయితే మాస్కులు ఏవైనా.. వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ప్రయోజనం ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే చెప్పింది.


సర్జికల్‌ మాస్కులను ఒకసారి ఉపయోగించాక తప్పక పారవేయాల్సి ఉంటుంది. కానీ, కాటన్‌ మాస్కులను ఉతుక్కుని మళ్లీ వాడవచ్చు. అయితే ప్రతిరోజూ ఉతకాల్సి ఉంటుంది. మాస్కును సబ్బుతో వేడినీళ్లలో ఉతికి.. ఎండలో కనీసం ఐదు గంటలపాటు ఆరబెట్టాలి. ఒకవేళ సూర్యరశ్మి తగిలే అవకాశం లేకపోతే.. మాస్కును ప్రెషర్‌ కుక్కర్‌లో ఉప్పునీటితో కనీసం 10 నిమిషాలపాటు ఉడికించి ఆరబెట్టాలి. కుక్కర్‌ లేనట్లయితే.. ఉప్పునీటిలో 15 నిమిషాలపాటు ఉడికించాలి. ఇక వేడినీళ్లు కూడా అందుబాటులో లేకపోతే మాస్కును సబ్బుతో ఉతికి.. ఐదు నిమిషాలపాటు వేడి తగిలేలా చేయాలి. ఐరన్‌ కూడా చేయవచ్చు. ఈ మేరకు కేంద్రానికి ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వయిజర్‌ కె.విజయరాఘవన్‌ ఈ సూచనలు చేశారు.

Updated Date - 2020-04-16T17:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising