ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!

ABN, First Publish Date - 2020-12-14T20:09:14+05:30

పగటిపూట నిరుత్సాహంగా, బడలికగా ఉండటం చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే ఆఫీసుల్లో పనిచేసే వారికి ఈ సమస్య ఇతర ఇబ్బందులను తీసుకొస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(14-12-2020)

పగటిపూట నిరుత్సాహంగా, బడలికగా ఉండటం చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే ఆఫీసుల్లో పనిచేసే వారికి ఈ సమస్య ఇతర ఇబ్బందులను తీసుకొస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కసరత్తులు అవసరం లేదు. ఇదిగో ఈ చిట్కాలు పాటిస్తే చాలు అంటున్నారు నిపుణులు. రోజూ సమయానికి నిద్ర పోవాలి. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. అంటే రాత్రి ఎనిమిది గంటల కల్లా భోజనం పూర్తయ్యేలా చూసుకోవాలి. పదికల్లా నిద్రపోవాలి. 


ప్రతిరోజూ కనీసం నలభైఐదు నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసే ముందు కోడిగుడ్లు, గుప్పెడు బాదంపప్పులు, ప్రొటీన్‌షేక్‌ వంటివి తీసుకోవాలి.


సమతుల ఆహారం తీసుకున్నప్పుడు శరీరానికి అవసరమైన శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఉపకరిస్తుంది. 


ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య ఒత్తిడి. దాన్నుంచి బయటపడడానికి పండ్లు, కూరగాయలు, చెర్రీలు, బ్రొకొలి లాంటివి తీసుకోవాలి.


జిమ్‌లో బరువులు ఎత్తడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ కండరాలు బలోపేతం కావడానికి బరువులు ఎత్తే వ్యాయామాలు బాగా ఉపకరిస్తాయి.  


నీళ్లు తాగడంలో చాలామంది అశ్రద్ధ చేస్తారు. కానీ తరచుగా నీళ్లు తాగడం అలవాటుగా చేసుకోవాలి.   


Updated Date - 2020-12-14T20:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising