ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థైరాయిడ్‌ సమస్య... బరువు తగ్గేందుకు..

ABN, First Publish Date - 2020-06-22T20:24:41+05:30

నాకు థైరాయిడ్‌ సమస్య... బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-06-2020)

ప్రశ్న: నాకు థైరాయిడ్‌ సమస్య... బరువు తగ్గేందుకు ఎలాంటి ఆహారపు అలవాట్లు పాటించాలి?

- భాను, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: థైరాయిడ్‌ సమస్య ఉన్నవారికి బరువు తగ్గడం కొంత కష్టమైన పనే. కానీ సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామం వల్ల అది సాధ్యమే. రోజువారీ ఆహారంలో బ్రౌన్‌ రైస్‌, గోధుమ రొట్టెలు; అప్పుడప్పుడూ చిరుధాన్యాలను తీసుకోండి. అయితే  ఆహారంలో అధిక భాగం ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఉండేలా చూసుకోవాలి. పాలు, పెరుగు, గుడ్లు తీసుకుంటూ ఉండాలి. ఉదయం అల్పాహారంగా ఓ గుడ్డు, ఓ కప్పు వెన్న తీసిన పాలు, ఓ పండు, అరకప్పు ఉప్మా, పోహా లాంటివి లేదా రెండు ఇడ్లీలు లేదా ఓ దోశ తీసుకో వచ్చు. మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ఓ కప్పు ఉడికించిన అన్నానికి కప్పు పప్పు, అంతే కాయగూరలు లేదా ఆకుకూరలు, పెరుగు తీసుకోవాలి. ఈ భోజనాలకు మధ్య పళ్ళు లేదా క్యారట్‌, టమాటా, కీరా లాంటి కూరగాయ ముక్కలు; బాదం, పిస్తా, వేరుశెనగ లాంటి గింజలు తీసుకోవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్‌, ముల్లంగి లాంటివి తగ్గించాలి. వీటిని పచ్చిగా కాకుండా ఉడికించి కానీ కూరగా కానీ చేసి వారంలో రెండుసార్లకు మించకుండా తీసుకోవచ్చు. ఈ ఆహార జాగ్రత్తలతో పాటు, రోజూ క్రమం తప్ప కుండా కనీసం 30 నిమిషాల పాటు వేగంగా నడవడం; నెమ్మదిగా పరిగెత్తడం; యోగా; ఈత కొట్టడం ఇలా ఏదో ఒక రకమైన వ్యాయామం చెస్తే మీరు నెమ్మదిగా బరువు తగ్గుతారు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను 

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-06-22T20:24:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising