ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ హార్మోన్‌ను పెంచుకోవాలంటే...

ABN, First Publish Date - 2020-12-11T15:19:15+05:30

టెస్టోస్టెరాన్‌ హార్మోను సహజంగా పెరిగేందుకు ఆరోగ్యకరమైన జీవనవిధానం పాటించడం అవసరం. ఆహారంలో విటమిన్‌ - సి అధికంగా ఉండే పండ్లు; జింక్‌ కోసం మాంసాహారం, గింజలు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(11-12-2020)

ప్రశ్న: మగవాళ్ళలో  టెస్టోస్టెరాన్‌ హార్మోను పెంచేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?


- శివ, ఒంగోలు 


డాక్టర్ సమాధానం: టెస్టోస్టెరాన్‌ హార్మోను సహజంగా పెరిగేందుకు ఆరోగ్యకరమైన జీవనవిధానం పాటించడం అవసరం. ఆహారంలో విటమిన్‌ - సి అధికంగా ఉండే పండ్లు; జింక్‌ కోసం మాంసాహారం, గింజలు, పప్పులు, గుడ్లు, చేపలు; విటమిన్‌ - డి కోసం రోజూ కనీసం అరగంట పాటు ఎండలో గడపడం మంచిది. మెంతులు, అశ్వగంధ లాంటివి తీసుకోవడం ద్వారా కొంత ఉపయోగం ఉంటుంది. స్వయంగా కాకుండా వైద్య నిపుణుల సలహామేరకు ఆయుర్వేద మందులు లేదా న్యూట్రిషన్‌ సప్లిమెంట్లను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. రోజూ విధిగా వ్యాయామం చేయడం ద్వారా కూడా టెస్టోస్టెరాన్‌ హార్మోను ఉత్పత్తిని పెంచుకోవచ్చు. ఆందోళన తగ్గించుకోవడం మంచిది. ఎత్తుకు తగిన బరువు ఉండేలా నియంత్రించుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లను పాటించడం అన్నిటికన్నా ముఖ్యం. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)



Updated Date - 2020-12-11T15:19:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising