ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాటి కల్లు నుంచి హ్యాండ్‌ శానిటైజర్‌

ABN, First Publish Date - 2020-04-10T18:06:28+05:30

ఇండోనేషియా హాలీడే స్పాట్‌ బాలిలోని ఫార్మాసిస్టులు సరికొత్త శానిటైజర్‌కు రూపకల్పన చేశారు. పులియబెట్టిన తాటి కల్లును శానిటైజర్‌గా మార్చారు. బాలి పోలీస్‌ చీఫ్‌ పీట్రస్‌ రెయిన్‌హార్డ్‌ గొలోజ్‌ ఆలోచన నుంచి ఇది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలి, ఏప్రిల్‌ 9: ఇండోనేషియా హాలీడే స్పాట్‌ బాలిలోని ఫార్మాసిస్టులు సరికొత్త శానిటైజర్‌కు రూపకల్పన చేశారు. పులియబెట్టిన తాటి కల్లును శానిటైజర్‌గా మార్చారు. బాలి పోలీస్‌ చీఫ్‌ పీట్రస్‌ రెయిన్‌హార్డ్‌ గొలోజ్‌ ఆలోచన నుంచి ఇది రూపుదిద్దుకుంది. ఆలోచన కలిగిందే తడవు, కార్యరంగంలోకి దిగిన ఆయన స్థానికంగా ఉన్న తాటికల్లు సరఫరాదారులను కలిశారు.


విషయాన్ని వివరించి చెప్పి, తమ దగ్గర ఉన్న సరకు నుంచి కొంత మొత్తాన్ని తనకు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. అలా సేకరించిన తాటికల్లును స్థానికంగా ఉన్న ఉదయన విశ్వవిద్యాలయ సిబ్బందికి ఇచ్చి హ్యాండ్‌ శానిటైజర్‌గా మార్చాలని  కోరారు. సరిగ్గా వారం రోజులు తిరక్కుండానే ఈ కల్లు నుంచి శానిటైజర్‌ ద్రవాన్ని అదీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు వారు రూపొందించారు. అందులో 96 శాతం ఆల్కహాలు కంటెంట్‌ ఉంది. చేతులకు ఇరిటేషన్‌ కలుగకుండా చూసేందుకు లవంగం, పుదీనా రసాలను కలిపారు. ఇప్పటివరకు 10,600 బాటిళ్ళ మేర హ్యాండ్‌ శానిటైజర్‌ను రూపొందించినట్టు యూనివర్సిటీకి చెందిన ఫార్మాస్యూటికల్‌ ఫ్యాకల్టీ హెడ్‌ దేవా ఆయు స్వస్తిని తెలిపారు. 

Updated Date - 2020-04-10T18:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising