ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు నాలుగు కప్పులు తాగితే..

ABN, First Publish Date - 2020-12-11T15:34:51+05:30

బరువు తగ్గేందుకు గ్రీన్‌ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్‌ టీ లో కంటే, గ్రీన్‌ టీలో కెఫిన్‌ తక్కువగా ఉంటుంది. గ్రీన్‌ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్‌ అనే రసాయనాలు ఉంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(11-12-2020)

ప్రశ్న: గ్రీన్‌ టీ ఉపయోగాలేమిటి? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది?


- రాజ్‌కుమార్‌, ఆదిలాబాద్‌


డాక్టర్ సమాధానం: బరువు తగ్గేందుకు గ్రీన్‌ టీ ఎక్కువగా ప్రాచుర్యం పొందినది. బ్లాక్‌ టీ, గ్రీన్‌ టీ లు రెండూ ఒకే జాతి మొక్కల నుండి లభిస్తాయి. బ్లాక్‌ టీ లో కంటే, గ్రీన్‌ టీలో  కెఫిన్‌ తక్కువగా ఉంటుంది. గ్రీన్‌ టీలో దాదాపు ముప్ఫయి వేల రకాల పాలీఫినాల్స్‌ అనే రసాయనాలు ఉంటాయి. ఈ పాలీఫినాల్స్‌ ఆరోగ్యానికి వివిధ రకాలుగా మేలు చేకూరుస్తాయి. కాటెచిన్‌, ఎపికాటెచిన్‌, ఎపిగాలో కాటెచిన్‌ గాలెట్‌ అనే ఫ్లేవనాయిడ్స్‌ యాంటీఆక్సిడెంట్స్‌గా పని చేసి  రోగనిరోధక వ్యవస్థ మెరుగవడానికి ఉపయోగపడతాయి. గ్రీన్‌ టీ ఉపయోగాలను పరిపూర్ణంగా పొందాలంటే దానిలో కెలోరీలను పెంచే తేనె, చక్కెర కలపకుండా తీసుకోవడం ఉత్తమం. అన్ని రకాల ఆహారం లానే గ్రీన్‌ టీ కూడా పరిమితికి మించి తీసుకుంటే మంచిది కాదు. రోజుకు నాలుగు కప్పులకు మించకుండా గ్రీన్‌ టీ తాగవచ్చు.



డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-12-11T15:34:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising