ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆస్తమాకు అల్లంతో చెక్!

ABN, First Publish Date - 2020-03-16T22:35:06+05:30

అల్లం వంటలకు రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆ రుచిని తగ్గించటం దగ్గర్నుంచి జీర్ణక్రియ పుంజుకునేలా చేయటం వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-03-2020)

అల్లం వంటలకు రుచిని తెచ్చిపెట్టడమే కాదు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆ రుచిని తగ్గించటం దగ్గర్నుంచి జీర్ణక్రియ పుంజుకునేలా చేయటం వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. దీని జౌషధ గుణాల్లో కొత్తగా మరోటి వచ్చి చేరింది. అల్లంలోని రసాయనాలు ఆస్తమా లక్షణాలు తగ్గటానికీ తోడ్పడగలవని తేలింది. ఆస్తమా బాధితుల్లో ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలు సన్నబడి శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. సాధారణంగా వీరికి గాలి గొట్టాల్లోని మృదుకండర (ఎఎస్‌ఎం) కణజాలాన్ని వదులు చేసే మందులు ఇస్తుంటారు. దీంతో శ్వాస తీసుకోవటం తేలికవుతుంది. అల్లంలోని జింజెరాల్, షాగావోల్ అనే రసాయనాలను శుద్ధిచేసి వాడితే.. ఆస్తమా మందుల మాదిరిగానే పనిచేస్తుందని కొలంబియా విశ్వవిద్యాలయం పరిశోధకులు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో ఉండే 'పీడీఈ4డీ' అనే ఎంజైమ్ గాలిగొట్టాలు వదులయ్యే ప్రక్రియను అడ్డుకుంటుంది. అల్లంలోని రసాయనాలు ఈ ఎంజైమ్‌ను నిరోధిస్తున్నట్టు కనుగొన్నారు.

Updated Date - 2020-03-16T22:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising