ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళ్ళను కాపాడుకోవడానికి..

ABN, First Publish Date - 2020-05-04T17:49:24+05:30

మన ఆహారంలోని పలు రకాల విటమిన్లు, ఖనిజాలు కంటి చూపు ఆరోగ్యానికి చాలా అవసరం. లుటీన్‌, జియాగ్జాంథిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రొకొలి, స్వీట్‌ కార్న్‌ ఎక్కువగా తీసుకోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-05-2020):

ప్రశ్న: కంటి చూపు ఆరోగ్యం కోసం ఏ ఆహారం మంచిది?


- రెడ్డి సాయి, జనగాం 


డాక్టర్ సమాధానం: మన ఆహారంలోని పలు రకాల విటమిన్లు, ఖనిజాలు కంటి చూపు ఆరోగ్యానికి చాలా అవసరం. లుటీన్‌, జియాగ్జాంథిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకుకూరలు, గుడ్లు, బ్రొకొలి, స్వీట్‌ కార్న్‌ ఎక్కువగా తీసుకోవడం వల్ల వయసుతో వచ్చే కంటి వ్యాధులు అదుపులో ఉంచవచ్చని తేలింది. విటమిన్‌- సి ఎక్కువగా ఉండే తాజా పళ్ళు, కాప్సికమ్‌, పాలకూర తీసుకోవడం వల్ల కాటరాక్టు సమస్యను నివారించవచ్చు. ముడిధాన్యాలు, బాదం, ఆక్రోట్‌, ఆకుకూరలలో ఉండే విటమిన్‌- ఇ  కంటిచూపు ఆరోగ్యానికి మంచిది. విటమిన్‌ - ఇ కంటి కణజాలం ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ని అడ్డుకుని ఎక్కువకాలం కంటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఆవశ్యక ఫాటీ యాసిడ్స్‌ ఒమేగా 3, ఒమేగా 6 లు కూడా కంటి చూపునకు అవసరమే. చేపలు, గుడ్లు, ఆక్రోట్‌, బాదం, అవిసె గింజలు తీసుకుంటే ఈ ఫాటీ ఆసిడ్స్‌ లభిస్తాయి. విటమిన్‌- ఎ, బీటా కెరోటిన్‌ అధికంగా ఉండే క్యారెట్లు, ఆకుకూరలు, గింజలు రెటీనా ఆరోగ్యానికి అవసరం. జింక్‌ అధికంగా ఉండే మాంసాహారం, పాలు, బీన్స్‌ ఆహారంలో భాగం చేసుకుంటే  కళ్లను కాపాడుకోవచ్చు. 

Updated Date - 2020-05-04T17:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising