ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా ఉండేందుకు ప్రత్యేకమైన ఆహారం..?

ABN, First Publish Date - 2020-09-26T22:09:50+05:30

ఆహారం ద్వారా మూడ్స్‌ మార్చుకోవచ్చా? ఉత్సాహంగా ఉండేందుకు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం తినాలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(26-09-2020)

ప్రశ్న: ఆహారం ద్వారా మూడ్స్‌ మార్చుకోవచ్చా? ఉత్సాహంగా ఉండేందుకు ఏదైనా ప్రత్యేకమైన ఆహారం తినాలా?

- దివ్య, సికింద్రాబాద్‌


డాక్టర్ సమాధానం: ఒత్తిడి, పరిసరాలు, పర్యావరణం, సరైన నిద్ర, జన్యువులు, మానసిక రుగ్మతలు, పోషక లోపాలు వంటి అనేక కారణాల వల్ల మానసిక స్థితి ప్రభావితం అవుతుంది. మనం తీసుకునే ఆహారం మెదడు నిర్మాణం, పనితీరును, తద్వారా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పోషకాహారాన్ని తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.  నిరాశ, ఆందోళన లక్షణాలను నివారించడానికి, మెరుగుపరచడానికి సమతులాహారం సహాయపడుతుంది. ఒమేగా-3  కొవ్వులు అధికంగా ఉండే చేపలు; థియోబ్రొమైన్‌, ఫ్లేవనాయిడ్స్‌ ఉండే ముదురు చాక్‌లెట్‌; ప్రోబయాటిక్స్‌ ఉండే పెరుగు, మజ్జిగ; అరటి, ఆపిల్‌, దానిమ్మ, నల్ల ద్రాక్ష లాంటి పండ్లు; ముడి ధాన్యాలు, గింజలు, బీ విటమిన్లు అధికంగా ఉండే పప్పు ధాన్యాలు మొదలైనవన్నీ మానసిక స్థితిని ఉత్సాహపరిచే ఆహారమే. స్వీట్లు, కాఫీ, టీలు, ఫాస్ట్‌ఫుడ్స్‌, నూనె పదార్థాలన్నీ కూడా దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని, తద్వారా మానసిక స్థితిపై చెడు ప్రభావాన్ని కలిగిస్తాయి.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2020-09-26T22:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising