ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాయామం తర్వాత అలసట రాకుండా ఉండాలంటే..

ABN, First Publish Date - 2020-10-06T21:15:55+05:30

వ్యాయామం చేసిన తరువాత నీరసంగా, తలనొప్పిగా ఉంటోంది. బయట రూమ్‌లో ఉండడం వల్ల పోషకాహారం వండుకునే సమయం ఉండడం లేదు. తేలికగా లభించే పోషకాహారం గురించి తెలియచేయండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-10-2020)

ప్రశ్న: వ్యాయామం చేసిన తరువాత నీరసంగా, తలనొప్పిగా ఉంటోంది. బయట రూమ్‌లో ఉండడం వల్ల పోషకాహారం వండుకునే సమయం ఉండడం లేదు. తేలికగా లభించే పోషకాహారం గురించి తెలియచేయండి? 

- వాసు, విజయవాడ


డాక్టర్ సమాధానం: వ్యాయామం యొక్క సత్ఫలితాలు పూర్తిగా అందాలంటే తగిన ఆహారం తీసుకోవాలి. వ్యాయామం చేయడానికి ఓ అరగంట ముందు అరటి పండు లేదా రెండు ఖర్జూరాలు తీసుకుంటే  అలసట వేయకుండా కావలసిన శక్తి వస్తుంది. వ్యాయామం తరువాత వచ్చే తలనొప్పికి డీహైడ్రేషన్‌ కారణం కావచ్చు. మధ్యలో కొద్దిగా నీళ్లు తీసుకుంటూ ఉంటే అలసట లేకుండా ఎక్సర్‌సైజ్‌లు పూర్తి చేయగలుగుతారు. ఒక వేళ మీ వ్యాయామ సమయం గంటన్నర కంటే ఎక్కువ ఉంటే మధ్యలో ఏదైనా ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం ముగిసిన ముప్పై నుండి నలభై నిమిషాల లోపు అరటిపండు, పాలతో చేసిన మిల్క్‌షేక్‌ కానీ, బాదం, ఆక్రోట్‌ లాంటి గింజలు, లేదా కొద్దిగా పళ్ళు, పెరుగు లాంటివి తీసుకుంటే మంచిది. అరలీటరు నుండి ముప్పావు లీటర్‌ నీళ్లు తీసుకుంటే చెమట ద్వారా శరీరం నుండి పోయిన నీటిని భర్తీ చేసుకోవచ్చు. అలాగే భోజన వేళల్లో ప్రొటీన్‌ కోసం ఉడికించిన గుడ్లు, పప్పు ధాన్యాలు, ఉడికించిన శనగలు, రాజ్మా, అలసందలు తీసుకోండి. అవకాశాన్ని బట్టి వారానికి ఒకటో రెండో సార్లు మాంసాహారం తీసుకోవచ్చు. పైవన్నీ కూడా తేలికగా రూమ్‌లో తయారు చేసుకోగలిగినవే. వీటన్నిటి వల్ల అలసట తగ్గి, శరీరం త్వరగా కోలుకుంటుంది. వ్యాయామం చేయని రోజుల్లో కూడా ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-10-06T21:15:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising