ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాను పోలిన ఫ్లూ జ్వరం!

ABN, First Publish Date - 2020-08-25T17:14:16+05:30

వర్షాకాలంలో ఫ్లూ జ్వరాలు అత్యంత సహజం. అయితే కరోనా విస్తారంగా ప్రబలిన ఈ సమయంలో ఏ జ్వరాన్నీ నిర్లక్ష్యం చేయలేం. లక్షణాలపరంగా ఈ రెండు ఇన్‌ఫెక్షన్లలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(25-08-2020)

వర్షాకాలంలో ఫ్లూ జ్వరాలు అత్యంత సహజం. అయితే కరోనా విస్తారంగా ప్రబలిన ఈ సమయంలో ఏ జ్వరాన్నీ నిర్లక్ష్యం చేయలేం. లక్షణాలపరంగా ఈ రెండు ఇన్‌ఫెక్షన్లలో స్వల్ప తేడాలూ లేకపోలేదు. అయినా తక్షణ వైద్యాన్ని ఆశ్రయించక తప్పదు. 


కొవిడ్‌, ఫ్లూ ఈ రెండు ఇన్‌ఫెక్షన్లలో ప్రధాన లక్షణం జ్వరం. ఈ రెండు శ్వాసకోస అంటువ్యాధులే! జ్వరం, పొడిదగ్గు ఈ రెండింట్లోనూ ఉంటాయి. అయితే ఆయాసం లాంటి కొవిడ్‌ మరో ప్రధాన లక్షణం ఫ్లూలో ఉండదు. అలాగే పొడిదగ్గు, జ్వరంతో పాటు జలుబు, గొంతునొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసట, విరేచనాలు కరోనాలో ఉంటాయి. ఫ్లూలో జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ముక్కు కారడం, గొంతునొప్పి, విరేచనాలు ప్రధానంగా కనిపిస్తాయి.


ఫ్లూ సోకినవారు 1 నుంచి 4 రోజుల పాటు మాత్రమే లక్షణాలను కలిగి ఉంటారు. అలాగే ఈ లక్షణాలు త్వరితంగా పెరుగుతాయి. అయితే లక్షణాలు ఫ్లూని పోలి ఉన్నా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను కలిసి కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడం అవసరం.


కొవిడ్‌కు హోమియో రక్ష! 

ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ‘సెంట్రల్‌ కౌన్సెల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ హోమియోపతి’ సిఫార్సు మేరకు హోమియో వైద్యంలో ఆర్సెనికం ఆల్బమ్‌ అనే మందును కొవిడ్‌ వ్యాధి నివారణకు వైద్యులు ఉపయోగిస్తున్నారు. ఈ మందును 30 పొటెన్సీలో రోజూ పరగడుపున ఒక మోతాదు చొప్పున 3 రోజులు తీసుకుంటే, రోగనిరోధక వ్యవస్థ బలపడి, కరోనా నుంచి రక్షణ దక్కుతుంది.


గతంలో మెదడువాపు, ప్లేగు, డెంగూ, చికెన్‌గున్యా, ఎబోలా మొదలైన అంటువ్యాధులు ప్రబలినప్పుడు అప్పటి ప్రభుత్వాలు అధికారికంగా హోమియో ప్రివెంటివ్‌ మెడిసిన్‌ను సిఫార్సు చేశాయి. ఆ మందులతో మంచి ఫలితాలు వచ్చాయి. కాబట్టి కొవిడ్‌ నుంచి రక్షణలో భాగంగా హోమియో వైద్యాన్ని ఆశ్రయించవచ్చు.


- డాక్టర్‌ జి.దుర్గాప్రసాద రావు

సీనియర్‌ హోమియోపతిక్‌, ఫిజీషియన్‌, హైదరాబాద్‌.



Updated Date - 2020-08-25T17:14:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising