ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ స్క్రబ్బర్‌తో మృతకణాలు మాయం!

ABN, First Publish Date - 2020-08-19T16:58:51+05:30

ముఖం, శరీరంపై ఉండే మృతకణాలు ఇబ్బంది పెడతాయి. అయితే కాఫీ గింజల పొడితో తయారుచేసే పేస్ట్‌ స్క్రబ్బర్‌గా పనిచేసి చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(19-08-2020)

ముఖం, శరీరంపై ఉండే మృతకణాలు ఇబ్బంది పెడతాయి. అయితే కాఫీ గింజల పొడితో తయారుచేసే పేస్ట్‌ స్క్రబ్బర్‌గా పనిచేసి చర్మంపై ఉండే మృతకణాలను పోగొడుతుంది. 


కాఫీ స్క్రబ్బర్‌: కాఫీ గింజలు శక్తిమంతమైన స్కిన్‌ స్క్రబ్బర్‌. ప్రకృతి సిద్ధమైంది. కాఫీ గింజలను మొదట మెత్తగా చేయాలి ఈ స్క్రబ్బర్‌ తయారీకి మూడు టేబుల్‌ స్పూన్ల కాఫీ పొడి, ఆలివ్‌ లేదా కొబ్బరినూనె ఒక టేబుల్‌స్పూన్‌, నీళ్లు కావాలి.


తయారీ: నూనెను కాఫీపొడిలో వేసి పేస్టులా చేయాలి. అందులో కొద్దిగా నీరు పోసి ఆ పేస్టును మరింత మెత్తగా చేయాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి వేళ్లతో అటుఇటు గుండ్రంగా తిప్పుతూ సున్నితంగా చర్మానికి రాయాలి. స్క్రబ్బింగ్‌ను మూడు నుంచి నాలుగు నిమిషాల చేయాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో స్క్రబ్బింగ్‌ చేసిన చర్మ భాగాన్ని కడిగేయాలి. ఈ కాఫీ స్క్రబ్‌ కాళ్లు, చేతుల మీద ఉన్న మృతకణాలను  పోగొడుతుంది. చర్మం హైడ్రేషన్‌తో బాగా మెరుస్తుంది. దీనిని ముఖానికి కూడా రాసుకోవచ్చు. సున్నితమైన స్క్రబ్బింగ్‌ కదలికల వల్ల చర్మం సుతిమెత్తగా మారుతుంది. అంతేకాదు చర్మం కింద కొవ్వు పేరుకుపోకుండా అదనంగా కాఫీ స్క్రబ్‌ సహాయపడుతుంది.



Updated Date - 2020-08-19T16:58:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising