ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందంతో పాటు శక్తి పెరగాలంటే..

ABN, First Publish Date - 2020-10-17T20:35:10+05:30

బరువు పెరగడానికి ఆహారం అధిక మోతాదులో తీసుకుంటే సరిపోదు. సరైన ఆహారం సరైన పాళ్ళలో, సరైన సమయంలో తీసుకుంటేనే అందులోని పోషకాలు మన శరీరానికి చక్కగా ఒంటబట్టి బరువు పెరగడంతో పాటు శక్తీ వస్తుంది. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్ల కోసం అన్ని రకాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(06-10-2020)

ప్రశ్న: బరువు పెరగడం, శరీర సౌష్టవం మెరుగవడమే కాక, శక్తి కూడా పెరగాలంటే ఏమి చేయాలి?


- రాధిక, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: బరువు పెరగడానికి ఆహారం అధిక మోతాదులో తీసుకుంటే సరిపోదు. సరైన ఆహారం సరైన పాళ్ళలో, సరైన సమయంలో తీసుకుంటేనే అందులోని పోషకాలు మన శరీరానికి చక్కగా ఒంటబట్టి బరువు పెరగడంతో పాటు శక్తీ వస్తుంది. శక్తినిచ్చే కార్బోహైడ్రేట్ల కోసం అన్ని రకాల ధాన్యాలు, పండ్లు ఉపయోగపడతాయి. కండరాలు బలమవడానికి అవసరమయ్యే మాంసకృత్తుల కోసం పాలు, గుడ్లు, చికెన్‌, చేప, అన్ని రకాల పప్పు ధాన్యాలు రోజూ తీసుకోవాలి. అలాగే మంచి రకాల కొవ్వుల కోసం బాదం, ఆక్రోట్‌ వంటి గింజలు, అవిసె గింజలు, వేరు సెనగలు మొదలైనవి తీసుకోవాలి. ప్రతిపూటా ఆహారంలో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవడం ద్వారా కూడా కొద్దిగా ఎక్కువ క్యాలోరీలను శరీరానికి అందించవచ్చు. రోజూ తప్పనిసరిగా అరగంటపాటు వ్యాయామం లేదా ఏదైనా ఆట ఆడినా ఆకలి పెరగడమే కాక తీసుకున్న ఆహారం చక్కగా ఒంటబట్టి బరువు పెరిగేందుకు, శక్తి పెరిగేందుకు ఉపయోగపడుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2020-10-17T20:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising