ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదే.. కానీ..

ABN, First Publish Date - 2020-06-09T21:17:32+05:30

కొన్ని రకాల కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఊరగాయలు, ఆవకాయలు పెడతారు. ఊరగాయల్లో ఉప్పు, నూనె, కారంతో పాటు అల్లం, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి వంటివి కూడా కలుపుతారు. సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషకవిలువలలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రశ్న: ఊరగాయలు తింటే మంచిదా? చెడ్డదా?

- రంజని, నెల్లూరు


సమాధానం: కొన్ని రకాల కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఊరగాయలు, ఆవకాయలు పెడతారు. ఊరగాయల్లో ఉప్పు, నూనె, కారంతో పాటు అల్లం, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి వంటివి కూడా కలుపుతారు. సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషకవిలువలలో మొత్తం కాకపోయినా కొంతైనా ఊరగాయల్లో కూడా ఉంటాయి. కొద్ది మోతాదులో ఊరగాయలు తీసుకుంటే వాటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మనకందటమే కాక జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఊరగాయల్లో మంచి బాక్టీరియా ఉండడం వల్ల ప్రోబయాటిక్స్‌గా పనిచేస్తాయి. కానీ, అధిక మొత్తంలో ఉప్పు, కారం ఉన్నందున ఊరగాయల్ని ఎక్కువ అన్నంలో కలుపుకుని తినాలి. కాబట్టి అవసరానికి మించి అన్నం తింటాం. అంతే కాకుండా ఊరగాయ ఎక్కువగా తినేవారు మాములు కాయగూరలు, ఆకుకూరలు తగ్గిస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఊరగాయలకు దూరంగా ఉండడం ఉత్తమం. వీటిలో ఎక్కువగా ఉండే నూనె ద్వారా కూడా అవసరమైన దానికంటే అధికంగా కెలోరీలు శరీరానికి అంది బరువు పెరగవచ్చు. ఈ ఊరగాయలు అన్నంతో తినడం కాకుండా కూరలతోనో, పప్పుతోనో, పెరుగులోనో నంజుకుని తింటే, అన్నం అధికంగా తీసుకొనే పని తప్పుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2020-06-09T21:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising