ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కట్టుడు పళ్లు... రాత్రికి వద్దు!

ABN, First Publish Date - 2020-02-25T17:20:01+05:30

న్యుమోనియా రావడానికి గల కారణాలు అనేకం. ఆహార పానీయాల్లోని కలుషితాలు, వాతావరణ కాలుష్యాలే అందుకు కారణమని చాలా మంది అనుకుంటారు. అయితే డెంచర్ల (కట్టుడు పళ్లు) వాడకంలోని దోషాలు కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యుమోనియా రావడానికి గల కారణాలు అనేకం. ఆహార పానీయాల్లోని కలుషితాలు, వాతావరణ కాలుష్యాలే అందుకు కారణమని చాలా మంది అనుకుంటారు. అయితే డెంచర్ల (కట్టుడు పళ్లు) వాడకంలోని దోషాలు కూడా అందుకు కారణమేనని ఇటీవల బయటపడింది. నిద్రకు ముందు డెంచర్లను తొలగించి శుభ్రం చేసి రాత్రంతా నీరునింపిన గ్లాసులో ఉంచాలనేది నియమం. ఆ మాటను ప్రతీ డాక్టర్‌ వాటిని బిగించాక చెబుతారు. అయితే చాలా మంది ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండిపోతారు. డెంచర్లు ఉన్నప్పుడు ఉండే ముఖ వర్చస్సు వాటిని తీసివేసినప్పుడు ఉండదన్న కారణంగా చాలా మంది రాత్రివేళ వాటిని తొలగించడానికి ఇష్టపడరు. ఇక వయసు పైబడిన వారిలో కూడా చాలా మంది ఓపిక లేక అలాగే ఉంచేస్తారు. అయితే, ప్రత్యేకించి, నిద్రకు ముందు డెంచర్లను తొలగించి శుభ్రం చేయకుండా ఉండిపోతే, నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది, అది శ్వాసకోశాల్లోకి వెళ్లి న్యుమోనియా వ్యాధికి దారి తీస్తుంది. న్యుమోనియాకు గురైన శ్వాసకోశాల్లో ఉచ్ఛ్వాస, నిశ్వాసలు సవ్యంగా జరగవు. దీనివల్ల శరీరం కణజాలానికి సరిపడా ఆక్సీజన్‌ అందదు. ఇది జీవక్రియలు కుంటుపడటానికీ, పలురకాల ఇతర వ్యాధులు రావడానికీ దారి తీస్తుంది. అందుకే డెంచర్లు ధరించిన వారు ప్రతి రోజూ నిద్రకు ముందు వాటిని తొలగించి శుభ్రపరచాలి, రాత్రంతా వాటిని నీళ్లల్లో ఉంచి ఉదయం ధరించడం శ్రేయస్కరం.

Updated Date - 2020-02-25T17:20:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising