ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండోసారి కొవిడ్‌!

ABN, First Publish Date - 2020-10-27T18:12:19+05:30

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక కరోనా మన జోలికి రాదులే అనుకోవడానికి వీలు లేదు. ‘కొవిడ్‌ రీఇన్‌ఫెక్షన్‌’ పొంచి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(27-10-2020)

కొవిడ్‌ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇక కరోనా మన జోలికి రాదులే అనుకోవడానికి వీలు లేదు. ‘కొవిడ్‌ రీఇన్‌ఫెక్షన్‌’ పొంచి ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలి.


కొవిడ్‌ నుంచి శాశ్వతంగా విముక్తి పొందడానికి ఉపయోగపడే ఏకైక సాధనం వ్యాక్సీన్‌! కాబట్టి సమర్థమైన కొవిడ్‌ టీకా అందుబాటులోకి వచ్చేవరకూ అప్రమత్తంగా వ్యవహరించక తప్పదు. కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడి కోలుకునేవారిలో యాంటీబాడీస్‌ తయారైనప్పటికీ, అవి ఎంత కాలం రక్షణ కల్పిస్తాయో చెప్పడం కష్టం. కాబట్టి రక్షణ చర్యలు పాటించడంలో ఏమాత్రం అలసత్వం వహించినా రీఇన్‌ఫెక్షన్‌ తప్పదు.


రెండోసారి కొవిడ్‌ అనేది పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలం పాటు  శరీరంలో వైరల్‌ లోడ్‌ తక్కువ మొత్తంలో కొనసాగుతూ ఉంటుంది. ఫలితంగా కొందరిలో తిరిగి కొవిడ్‌ లక్షణాలు మొదలై, రెండోసారి కొవిడ్‌కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.


కొవిడ్‌ యాంటీబాడీలు దీర్ఘకాలం పాటు కరోనా నుంచి రక్షణ కల్పించలేవు. కొవిడ్‌ నుంచి కోలుకున్న 3 నుంచి 9 వారాల్లో శరీరంలో యాంటీబాడీలు తరిగిపోతాయి. ఈ కాలపరిమితిని ఐ.సి.ఎమ్‌.ఆర్‌ 100 రోజులుగా నిర్ణయించింది. కొవిడ్‌ సోకిన అందర్లో సమానంగా యాంటీబాడీలు తయారయ్యే పరిస్థితి ఉండదు. తక్కువ తీవ్రతతో కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లలో యాంటీబాడీలు కూడా తక్కువగానే తయారవుతాయి. కాబట్టి రీఇన్‌ఫెక్షన్‌కు గురికాకుండా తప్పనిసరిగా కరోనా రక్షణ చర్యలు దీర్ఘకాలం పాటు కొనసాగించాలి.  

Updated Date - 2020-10-27T18:12:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising