ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా దశావతారాలు

ABN, First Publish Date - 2020-04-29T16:15:56+05:30

ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి సోకి దాదాపు 3 లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్‌-19 గురించి చెప్పేటప్పుడు ‘కరోనా వైరస్‌’ అని మాటవరసకు అనేస్తున్నాంగానీ.. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఈ వైరస్‌ ఇప్పటికి పది రకాలుగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(29-04-2020):

అన్నిటి కంటే బలమైనది ఏ2ఏ రకం

వ్యాప్తి చెందడం, ఊపిరితిత్తులపై దాడి చేయడంలో అత్యంత సమర్థం

బెంగాల్‌ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి


ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మందికి సోకి దాదాపు 3 లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కొవిడ్‌-19 గురించి చెప్పేటప్పుడు ‘కరోనా వైరస్‌’ అని మాటవరసకు అనేస్తున్నాంగానీ.. జన్యు ఉత్పరివర్తనాల వల్ల ఈ వైరస్‌ ఇప్పటికి పది రకాలుగా మారింది. వాటన్నింటిలోకీ బలమైనది ఏ2ఏ వేరియంట్‌గా శాస్త్రజ్ఞులు తేల్చారు. ఒకరి నుంచి మరొకరికి సోకే సామర్థ్యం, మానవుల ఊపిరితిత్తుల కణాలపై దాడిచేసే సత్తా పుష్కలంగా ఉండడంతో ఈ రకం వైరస్‌.. మిగతావాటన్నింటినీ తోసి‘రాజ’య్యిందని, ప్రాంతాలకు అతీతంగా ప్రపంచం మొత్తానికీ  పాకిందని మన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌కు చెందిన నిధాన్‌ బిశ్వాస్‌, పార్థా మజుందార్‌ ఈ వైర్‌సపై విస్తృత అధ్యయనం చేసి పలు ఆసక్తికరమైన విశేషాలను కనుగొన్నారు. అవేంటంటే..


అధ్యయనంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 55 దేశాల్లో కరోనా సోకినవారి నుంచి సేకరించిన వైర్‌సల ఆర్‌ఎన్‌ఏ జన్యుక్రమాలను సేకరించి విశ్లేషించారు. వాటిలో 1848  (అంటే 50.8ు) ఏ2ఏ రకానివే. 582 సీక్వెన్స్‌లు ‘ఓ’ రకానివి కాగా.. 505 సీక్వెన్స్‌లు ‘బి1’ రకానివి.

 

మనదేశంలో సేకరించిన 35 ఆర్‌ఎన్‌ఏ సీక్వెన్సుల్లో 47.5 శాతం.. అంటే ఏకంగా 16 సీక్వెన్స్‌లు ఏ2ఏ రకానిగా తేలాయి. ‘ఏ3’ రకానివి 13 ఉండగా.. ‘ఓ’.. 5, ‘బి’ రకం ఒకటి ఉన్నాయి. 


చైనాలో మొదలైన నావెల్‌ కరోనా వైరస్‌ ‘ఓ’ రకానికి చెందినది. దాన్నుంచి ఏ2, ఏ2ఏ, ఏ3, బి, బి1.. ఇలా పది రకాలు పుట్టాయి. ‘ఓ’ కన్నా కూడా ‘ఏ2ఏ’ రకం వైరస్‌ చాలా బలమైనది.


సాధారణంగా వైరస్‌ల జన్యువుల్లో ఉత్పరివర్తనాలు జరిగినప్పుడు అవి వేరొకరికి సోకే సామర్థ్యాన్ని కోల్పోతాయి. కొన్ని ఉత్పరివర్తనాలు మాత్రం ఆ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాంటి రకాలు ఒకదశలో తమ పుట్టుకకు కారణమైన అసలు వైర్‌సను సైతం అధిగమించి భారీగా వ్యాపిస్తాయి. ఏ2ఏ రకం అలాంటిదే. 


2010లో సార్స్‌కు కారణమైన కరోనా వైర్‌సకూ మానవ ఊపిరితిత్తులపై దాడి చేసే సామర్థ్యం ఉన్నా.. దీనంత గొప్ప నైపుణ్యం ఆ రకానికి లేదు. 


- సెంట్రల్‌ డెస్క్

Updated Date - 2020-04-29T16:15:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising