ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లల్లో కరోనా!

ABN, First Publish Date - 2020-04-28T16:18:46+05:30

పిల్లలకు కరోనా సోకినా అతిగా కంగారు పడవద్దు. కరోనా నుంచి కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయనీ, సరైన సపోర్టివ్‌ కేర్‌ ఇందుకు తోడ్పడుతుందని పరిశోఽధకులు అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-04-2020)

పిల్లలకు కరోనా సోకినా అతిగా కంగారు పడవద్దు. కరోనా నుంచి కోలుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయనీ, సరైన సపోర్టివ్‌ కేర్‌ ఇందుకు తోడ్పడుతుందని పరిశోఽధకులు అంటున్నారు. 


చైనా, సింగపూర్‌లకు చెందిన 1065 మంది కరోనా సోకిన పిల్లల మీద జరిపిన అద్యయనం ఒకటి జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో ప్రచురితమైంది. ఆ అధ్యయనం ప్రకారం కరోనా సోకిన పిల్లల్లో లక్షణాలు అంతగా బయల్పడవనీ, సరైన సమయంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి సపోర్టివ్‌ చికిత్సను అందిస్తే, వారు ఒకటి, రెండు వారాల్లో పూర్తిగా కోలుకుంటారనీ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.


ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ పావియాకు చెందిన అధ్యయనకారుల పరిశీలనలో కొవిడ్‌ - 19 సోకిన పిల్లల్లో పొడి దగ్గు, జ్వరం, నీరసం లాంటి లక్షణాలు బయల్పడకుండా ఉండే వీలుందని తేలింది. అయితే విరేచనాలు, వాంతులు లాంటి జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యల ద్వారా కరోనా బయల్పడే వీలుందట. అలాగే పరిస్థితి విషమించి, న్యుమోనియాతో షాక్‌కు గురై, మూత్రపిండాల ఫెయిల్యూర్‌తో ఆస్పత్రికి చేరిన ఓ పసికందుకు ఇంటెన్సివ్‌ కేర్‌ చికిత్సతో పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తేగలిగినట్టు కూడా వారు చెప్పారు. ఈ పరిశోధనలో తొమ్మిదేళ్ల లోపు కరోనా సోకిన పిల్లలు ఆస్పత్రిపాలైనా, ఇప్పటివరకూ ఒక్క మరణం కూడా నమోదు కాలేదని వారంటున్నారు. అయితే ఈ విషయం గురించి మరింత లోతైన పరిశోధనలు మరిన్ని జరపవలసిన అవసరం ఉంది.

Updated Date - 2020-04-28T16:18:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising